Loading...
Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. 332 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
లాభాల్లో ముగిసిన సూచీలు.. 332 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. 332 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 16, 2026
04:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమావేశ ఫలితాల కోసం మదుపర్లు ఎదురుచూస్తున్న వేళ.. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు స్వల్పంగా తగ్గడం దేశీయ మార్కెట్‌కు అనుకూలంగా మారింది. ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ, రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంకింగ్‌ రంగాల షేర్లలో కొనుగోళ్లు సూచీలకు మద్దతుగా నిలిచాయి. దీంతో వరుసగా రెండు రోజుల నష్టాలకు బ్రేక్‌ పడింది. సెన్సెక్స్‌ ఉదయం 74,249.31 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. మునుపటి ముగింపు 74,003.82 పాయింట్లతో పోలిస్తే ఇది మెరుగైన స్థాయి. రోజులో ఎక్కువసేపు లాభాల్లోనే కదలాడిన సూచీ.. ఇంట్రాడేలో 74,505.86 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 332.63 పాయింట్లు లాభపడి 74,336.45 వద్ద స్థిరపడింది.

వివరాలు 

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.95గా నమోదు 

మరోవైపు నిఫ్టీ 99 పాయింట్లు పెరిగి 23,217.60 వద్ద ముగిసింది.

విదేశీ మారక మార్కెట్‌లో డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.95గా నమోదైంది.

సెన్సెక్స్‌ 30లో ఐటీసీ, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, ట్రెంట్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బీఈఎల్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.

టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాలను చవిచూశాయి.

అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 107.73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు బంగారం ఔన్స్‌ ధర 4,342.99 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ADVERTISEMENT