
Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 315 పాయింట్లు, నిఫ్టీ 82 పాయింట్లు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ల లాభ పరంపరకు చివరకు విరామం కలిగింది. ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన కారణంగా మార్కెట్ సూచీలు నష్టాలను ఎదుర్కొన్నాయి.
ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాలు కొనసాగడం గమనార్హం.
అయితే, విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు కొనసాగడం, అమెరికా-చైనా మధ్య వాణిజ్య విభేదాలు తగ్గుతుండటం వల్ల నష్టాలు తక్కువగా ఉండిపోయాయి.
మొత్తంగా చెప్పాలంటే, గత ఏడురోజులుగా కొనసాగిన లాభాల ర్యాలీకి బ్రేక్ పడింది. సెన్సెక్స్ మళ్లీ 80,000 మార్క్ కిందకు జారింది.
ఈరోజు ఉదయం సెన్సెక్స్ 80,058.43 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది (మునుపటి ముగింపు స్థాయి 80,116.49).
వివరాలు
బంగారం ధర ఔన్సుకు 3,344 డాలర్లు
ట్రేడింగ్ మొత్తం నష్టాల్లోనే సాగింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 79,724.55 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకిన తర్వాత, చివరికి 315 పాయింట్ల నష్టంతో 79,801.43 వద్ద ముగిసింది.
నిఫ్టీ కూడా 82 పాయింట్ల నష్టంతో 24,246వద్ద స్థిరపడింది. కరెన్సీ మారకం విషయంలో, రూపాయి విలువ 17పైసలు బలపడి 85.28 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్‌కు చెందిన 30 షేర్లలో హిందుస్థాన్ యూనిలీవర్,భారతీ ఎయిర్‌టెల్,ఐసీఐసీఐ బ్యాంక్, ఎటర్నల్,మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు ముఖ్యంగా నష్టపోయాయి.
మరోవైపు, ఇండస్ ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్,టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 66.47డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ధర ఔన్సుకు 3,344 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.