LOADING...
Stock market: లాభాల స్వీకరణతో నష్టాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్ 322 పాయింట్లు డౌన్
లాభాల స్వీకరణతో నష్టాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్ 322 పాయింట్లు డౌన్

Stock market: లాభాల స్వీకరణతో నష్టాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్ 322 పాయింట్లు డౌన్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 05, 2026
04:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల మధ్య ముగిశాయి. ఉదయం స్థిరంగా ప్రారంభమైన సూచీలు, మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ఐటీ రంగంతో పాటు ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ విభాగాల్లో విక్రయాలు పెరిగాయి. కీలక షేర్లు గరిష్ఠ స్థాయిల వద్ద ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఈ పరిణామాలతో మార్కెట్‌ సూచీలు దిగివచ్చాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఉదయం 85,640.05 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. క్రితం రోజు ముగింపు 85,762.01తో పోలిస్తే స్వల్ప నష్టంతో ఆరంభమైన సూచీ, కొంతసేపు లాభాల్లో కదలాడినా, అనంతరం అమ్మకాల ఒత్తిడితో మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. ట్రేడింగ్‌ సమయంలో 85,315.33 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్‌, చివరికి 322.39 పాయింట్ల నష్టంతో 85,439.62 వద్ద ముగిసింది.

వివరాలు 

డాలరుతో రూపాయి మారకం విలువ 90.28గా నమోదు 

ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో రూపాయి మారకం విలువ 90.28గా కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 60.76 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ధర ఔన్సుకు 4,435 డాలర్ల వద్ద కదలాడింది. సెన్సెక్స్‌లో లాభాలు సాధించిన ప్రధాన షేర్లలో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ (బీఈఎల్‌), హిందుస్థాన్‌ యూనిలీవర్‌, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ ఉన్నాయి. నష్టాలు చవిచూసిన షేర్లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టీసీఎస్‌ ఉన్నాయి.

Advertisement