Stock market: నేడు లాభాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ల నుండి అందుతున్న సానుకూల సంకేతాలతో, దేశీయ మార్కెట్ సూచీలు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:17 గంటల వద్ద నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 23,311 వద్ద, సెన్సెక్స్ 109 పాయింట్లు పెరిగి 80,357 వద్ద ట్రేడవుతున్నాయి. సోలార్ ఇండస్ట్రీస్, ఎంవోఐఎల్, ప్రికోల్ లిమిటెడ్, నవ లిమిటెడ్ షేర్లు అత్యధిక లాభాల్లో ఉన్నాయి. కాగా వరుణ్ బేవరేజస్, స్ట్రైడెస్ ఫార్మా, వినతి ఆర్గానిక్స్, సన్‌టెక్ రియాల్టీ, అరవింద్, జెన్ టెక్నాలజీస్, చోళమండల్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. రూపాయి విలువ నేడు 84.73 గా ఉంది.
వచ్చే ఏడాది ఐపీఓ విడుదలకు జెప్టో సంస్థ
ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ఒక్క షెంజెన్ సూచీ మినహా మిగిలిన ప్రధాన మార్కెట్లన్నీ లాభాల్లోనే ఉన్నాయి. ఈకామ్ ఎక్స్‌ప్రెస్, స్మార్ట్‌వర్క్స్ కోవర్కింగ్ స్పేసెస్ సహా 7 కంపెనీలు తమ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ప్రతిపాదనలకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అనుమతి పొందాయి. ఈ కంపెనీలు మొత్తం దాదాపు రూ.12,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఐపీఓ అనుమతి పొందిన మరో కంపెనీలు ట్రూఆల్ట్ బయోఎనర్జీ, కరారో ఇండియా, కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్, వెంటివ్ హాస్పిటాలిటీ ఉన్నాయి. అలాగే, వచ్చే ఏడాది ఐపీఓ విడుదలకు జెప్టో సంస్థ సీఈఓ అదిత్ పలిచా ప్రకటన చేశారు.