Loading...
Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 576 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌!
భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 576 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌!

Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 576 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 22, 2026
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్ లో ఒత్తిడి కొనసాగుతోంది. ఈ వారం ఇప్పటికే భారీ నష్టాలను చవిచూసిన సూచీలు.. గురువారం (అక్టోబర్‌ 22) కూడా నష్టాలతోనే ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన మదుపర్లు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సోమవారం ట్రేడింగ్‌ సెషన్‌లో సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. బుధవారం ఒక దశలో గణనీయమైన లాభాలు నమోదు చేసినప్పటికీ.. ఆ తర్వాత తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఎదురై చివరకు నష్టాల్లో ముగిశాయి. తాజాగా గురువారం కూడా ఇదే ధోరణి కొనసాగుతోంది. గురువారం ఉదయం మార్కెట్లు ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్‌ 350 పాయింట్లకు పైగా నష్టపోయింది.

వివరాలు

నిమిషాల్లోనే రూ.6 లక్షల కోట్లకు పైగా నష్టం

ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఒక దశలో ఈ పతనం 700 పాయింట్లను దాటింది. దీంతో సెన్సెక్స్‌ 73,005.11 వద్ద సెషన్‌ కనిష్ఠ స్థాయిని తాకింది. మరోవైపు నిఫ్టీ కూడా దాదాపు 200 పాయింట్ల వరకు పడిపోయింది.

సూచీల పతనంతో మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన మదుపర్లలో ఆందోళన నెలకొంది. స్టాక్‌ మార్కెట్లలో భారీ అమ్మకాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద గణనీయంగా తగ్గిపోయింది.

బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువను మదుపర్ల సంపదగా పరిగణిస్తారు. బుధవారం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి ఈ విలువ రూ.461.78 లక్షల కోట్లుగా ఉంది.

అయితే గురువారం మార్కెట్లు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే అది రూ.455 లక్షల కోట్లకు పడిపోయింది.

వివరాలు

పలు హెవీవెయిట్‌ షేర్లలో భారీ పతనం

గురువారం ఉదయం మార్కెట్‌ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద రూ.6 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది.

అంతకుముందు బుధవారం కూడా మదుపర్లు రూ.6 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు.

వరుస సెషన్లలో మార్కెట్లు నష్టాలను నమోదు చేస్తుండటంతో ఇన్వెస్టర్ల సంపదపై తీవ్ర ప్రభావం పడుతోంది.

మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో సెన్సెక్స్‌ 30 షేర్ల సూచీలో ఎటర్నల్‌ (జొమాటో), భారతీ ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ మినహా మిగిలిన షేర్లన్నీ నష్టాల్లో ట్రేడయ్యాయి.

పవర్‌ గ్రిడ్‌, బీఈఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు 2 శాతానికి పైగా పడిపోయాయి. మారుతీ సుజుకీ, ట్రెంట్‌, ఎంఅండ్‌ఎం, రిలయన్స్‌ వంటి కీలక హెవీవెయిట్‌ షేర్లు కూడా ఒక శాతానికి పైగా నష్టపోయాయి.

ADVERTISEMENT