LOADING...
Stock Market: నాలుగో రోజూ కూడా తప్పని నష్టాలు.. 200 పాయింట్ల పైగా నష్టపోయిన సెన్సెక్స్ 
నాలుగో రోజూ కూడా తప్పని నష్టాలు.. 200 పాయింట్ల పైగా నష్టపోయిన సెన్సెక్స్

Stock Market: నాలుగో రోజూ కూడా తప్పని నష్టాలు.. 200 పాయింట్ల పైగా నష్టపోయిన సెన్సెక్స్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 08, 2026
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ సూచీలు వరుసగా నాలుగో రోజు కూడా నష్టంలో కొనసాగుతున్నాయి. విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు సూచీలపై ఒత్తిడి సృష్టించాయి. అదనంగా, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల కూడా మార్కెట్‌ను వెనక్కి లాగుతోంది. మెటల్ రంగంలోని స్టాక్స్ భారీ నష్టాలను నమోదు చేస్తున్నాయి. ఐటీ రంగంలోని షేర్లపై కూడా అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల వల్ల సెన్సెక్స్, నిఫ్టీ రెండూ నష్టాల్లోనే కదులుతున్నాయి. గత సెషన్ ముగింపు 84,961 పాయింట్ల వద్ద ఉండగా, గురువారం ఉదయం సెన్సెక్స్ 200 పాయింట్ల పైగా నష్టంతో ప్రారంభమయ్యింది. కొంతసేపు కోలుకుని ఒక దశలో లాభాల్లోకి వచ్చినప్పటికీ, మళ్లీ తిరిగి నష్టాల వైపు చెల్లిపోయింది.

వివరాలు 

 డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 89.81గా నమోదు 

ఉదయం 10:00 గంటల పరిస్థితి ప్రకారం, సెన్సెక్స్ 84,745 పాయింట్ల వద్ద 216 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ సరైన దారిలో కదులుతూ, 26,076 పాయింట్ల వద్ద 64 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. సెన్సెక్స్‌లో బజాజ్ హోల్డింగ్స్, సీజీ పవర్, సోలార్ ఇండియా, ఒబెరాయ్ రియాల్టీ, ఎటర్నల్ వంటి షేర్లు లాభాల్లో ఉన్నాయి. హిందుస్థాన్ జింక్, నాల్కో, జిందాల్ స్టీల్, ఎన్‌ఎమ్‌డీసీ, వేదాంత వంటి షేర్లు నష్టాల బాటలో ఉన్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 418 పాయింట్ల నష్టంతో ఉంది, బ్యాంక్ నిఫ్టీ 56 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 89.81 వద్ద ఉంది.

Advertisement