Layoffs: టెక్ రంగంలో ఉద్యోగాల కోతల మధ్య.. భారత్‌లో 50,000 మందిని నియమించనున్న డెలాయిట్
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ రంగంలో ఒకవైపు భారీగా ఉద్యోగాల కోతలు కొనసాగుతుండగా,మరోవైపు నియామకాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000ఉద్యోగాలను తగ్గించింది. AI, క్లౌడ్ టెక్నాలజీలపై దృష్టి పెట్టే క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి విరుద్ధంగా డెలాయిట్ భారత్‌లో దాదాపు 50,000మంది ఉద్యోగులను నియమించనున్నట్లు ప్రకటించింది. AI వల్ల ఉద్యోగాలు తగ్గడం కాదని, కొత్త నైపుణ్యాలతో ఉద్యోగులను సిద్ధం చేయడమే లక్ష్యమని కంపెనీ చెబుతోంది. ఇప్పటికే వేలాది మందికి AIశిక్షణ ఇవ్వడమే కాకుండా,మరిన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు ప్రారంభించింది. ఇదే సమయంలో Amazon,Dell,Meta వంటి సంస్థలు కూడా ఖర్చులు తగ్గించేందుకు వేల సంఖ్యలో ఉద్యోగాలను కోత పెట్టాయి. మొత్తానికి,AI ప్రభావంతో భవిష్యత్తులో ఉద్యోగాల స్వభావం పూర్తిగా మారబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
లేఆఫ్స్ ట్రెండ్ మధ్య డెలాయిట్ భారీ హైరింగ్ నిర్ణయం
🚨 Deloitte plans to hire 50,000 professionals across India; I don't think job losses are the way, says Deloitte South Asia CPO Nitin Kini. pic.twitter.com/SWl3dLbhHq
— Indian Tech & Infra (@IndianTechGuide) April 1, 2026