Page Loader
Bitcoin: 40,000 డాలర్ల మార్కును బిట్‌కాయిన్ విలువ.. ఇన్వెస్టర్లలో ఆనందం 
Bitcoin: 40,000 డాలర్ల మార్కును బిట్‌కాయిన్ విలువ.. ఇన్వేస్టర్లలో ఆనందం

Bitcoin: 40,000 డాలర్ల మార్కును బిట్‌కాయిన్ విలువ.. ఇన్వెస్టర్లలో ఆనందం 

వ్రాసిన వారు Stalin
Dec 04, 2023
06:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకటిన్నర సంవత్సరాల తర్వాత బిట్‌కాయిన్ పెట్టుబడిదారుల ముఖాల్లో మళ్లీ ఆనందం చిగురించింది. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన బిట్‌కాయిన్ ధర మరోసారి 40,000 డాలర్ల మార్కును దాటింది. మే 2022 తర్వాత బిట్‌కాయిన్ విలువ ఈ స్థాయికి పెరగడం ఇదే మొదటిసారి. బిట్‌కాయిన్ విలువ పెరగడానికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి వడ్డీరేట్లలో కోత కాగా.. మరొకటి డిమాండ్ పెరగడం కావడం గమనార్హం. బిట్‌కాయిన్ విలువ సోమవారం ఉదయం నాటికి 1 శాతం పెరిగింది. సింగపూర్‌లో ఈ క్రిప్టో కరెన్సీ విలువ అత్యధికంగా 40,005 డాలర్లకు చేరుకుంది. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు బిట్‌కాయిన్ ధర 142 శాతం పెరిగింది.

బిట్ కాయిన్

బిట్‌కాయిన్ విలువ పెరగడానికి కారణం ఇదే..

అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గిన తర్వాత, ఫెడరల్ రిజర్వ్ ఇప్పుడు వడ్డీ రేట్లను పెంచదని పెట్టుబడిదారులు విశ్వసిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి వడ్డీ రేట్లు తగ్గుతాయని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. గత ఏడు రోజుల్లో బిట్‌కాయిన్ విలువ దాదాపు 10 శాతం పెరిగింది. మరో క్రిప్టో కాయిన్‌ ఇథేరియం గత 24 గంటల్లో 3.3 శాతం పెరిగడం విశేషం. ఇదిలా ఉంటే, తొలి అమెరికా స్పాట్‌ బిట్‌కాయిన్‌ ఈటీఎఫ్‌ను ప్రారంభించడానికి బ్లాక్‌రాక్‌ కంపెనీ దరఖాస్తు చేసుకోగా.. జనవరిలో దీనికి అనుమతి లభించే అవకాశాలు ఉన్నాయి.