LOADING...
Gold Prices: ఒక్కరాత్రిలో మారిన సీన్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
ఒక్కరాత్రిలో మారిన సీన్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Gold Prices: ఒక్కరాత్రిలో మారిన సీన్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 31, 2026
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం ధరలు మళ్లీ పైకి ఎగబాకుతున్నాయి. ఇటీవల గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గినప్పటికీ, ఇప్పుడు మళ్లీ పెరుగుదల దిశగా సాగుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార నిపుణులు చెబుతున్నారు. మంగళవారం కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశంలోని ముఖ్య నగరాల్లో నేటి రేట్లు ఇలా ఉన్నాయి.

వివరాలు

బంగారం ధరలు ఇలా

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,270గా ఉంది. నిన్న ఇది రూ.1,48,260 వద్ద ఉండేది. 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ రూ.1,35,910గా ఉండగా, నిన్న రూ.1,35,900గా ఉంది. బెంగళూర్‌లో 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,48,270గా ఉంది. నిన్న రూ.1,48,260గా ఉండేది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఇవాళ రూ.1,35,910 కాగా, నిన్న రూ.1,35,900గా ఉంది. చైన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,230గా ఉంది. నిన్న రూ.1,50,220గా ఉండేది. 22 క్యారెట్ల ధర ఇవాళ రూ.1,36,040గా ఉండగా, నిన్న రూ.1,36,050గా ఉంది. దిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,48,420గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,060గా ట్రేడవుతోంది.

వివరాలు

వెండి ధరలు ఇవే..

దిల్లీలో కేజీ వెండి ధర రూ.2,44,900గా ఉంది. నిన్న ఇది రూ.2.45 లక్షల వద్ద ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,55,100గా కొనసాగుతోంది. నిన్న కూడా ఇదే స్థాయిలో ఉంది. చైన్నైలో కేజీ వెండి ధర రూ.2,55,100గా కొనసాగుతోంది. బెంగళూర్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2,44,900గా ఉండగా, నిన్న ఇది రూ.2.45 లక్షల వద్ద ఉంది. మొత్తంగా చూస్తే, బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుదల దిశగా కదులుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత పెరుగుదల ఉండే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement