
Gold Rates: భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం గోల్డ్ ధర ఎంతుందంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
ఈ రోజు బంగారం ధరలో భారీ తగ్గుదల కనిపించింది. ఒక్క తులం బంగారం ధర రూ.600 మేర తగ్గింది.
ధరల పతనం వలన కొనుగోలుదారుల్లో సంతోషం నెలకొంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర (గ్రాముకు) రూ.10,048గా ఉంది.
అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర (గ్రాముకు) రూ.9,210కి ట్రేడ్ అవుతోంది.
22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.550 తగ్గి ప్రస్తుతం రూ.92,100 వద్ద ఉంది.
అలాగే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.600 పడిపోయి ఇప్పుడు రూ.1,00,480 వద్ద ట్రేడ్ అవుతోంది.
విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా హైదరాబాద్ ధరలే కొనసాగుతున్నాయి.
వివరాలు
గణనీయంగా తగ్గిన వెండి ధరలు
ఇతర నగరాల్లోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 తగ్గి రూ.92,250గా నమోదైంది.
ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.580 తగ్గి రూ.1,00,630 వద్దకు చేరుకుంది. బంగారంతో పాటు వెండి ధరలు గణనీయంగా తగ్గాయి.
ఈ రోజు కిలో వెండి ధర రూ.2,000 తగ్గింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,20,000గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి రూ.1,10,000కి ట్రేడ్ అవుతోంది.