LOADING...
PPF: ఒకే వ్యక్తికి రెండు పీపీఎఫ్ ఖాతాలు.. లాభమా? లేక నష్టమా? పూర్తి వివరాలివే!
ఒకే వ్యక్తికి రెండు పీపీఎఫ్ ఖాతాలు.. లాభమా? లేక నష్టమా? పూర్తి వివరాలివే!

PPF: ఒకే వ్యక్తికి రెండు పీపీఎఫ్ ఖాతాలు.. లాభమా? లేక నష్టమా? పూర్తి వివరాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 15, 2026
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు పొదుపు పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాల ద్వారా పెట్టుబడులు పెడితే మంచి లాభాలతో పాటు పన్ను రాయితీలు కూడా లభిస్తాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పథకాలు కావడంతో పెట్టుబడికి భద్రత ఉంటుందనే నమ్మకంతో చాలామంది వీటిలో డబ్బులు పెట్టడానికి ముందుకొస్తున్నారు. ప్రభుత్వ సేవింగ్స్ స్కీమ్స్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF). ఏ బ్యాంకులోనైనా పీపీఎఫ్ ఖాతా ప్రారంభించవచ్చు. నెలకు కనీసం రూ.500 నుంచి ఇష్టమైనంత మొత్తాన్ని జమ చేయవచ్చు. ఈ ఖాతాకు 15 సంవత్సరాల లాక్-ఇన్ కాలం ఉంటుంది. ఆ కాలం పూర్తయిన తర్వాత ఒకేసారి గణనీయమైన మొత్తం చేతికి అందుతుంది.

Details

మరో ఖాతా తెరవడం నిబంధనలకు విరుద్ధం

అయితే ఒక వ్యక్తి ఒకే పీపీఎఫ్ ఖాతా మాత్రమే నిర్వహించాలి. ఇప్పటికే ఒక బ్యాంకులో పీపీఎఫ్ అకౌంట్ ఉంటే, మరో బ్యాంకు లేదా పోస్టాఫీసులో మరో ఖాతా తెరవడం నిబంధనలకు విరుద్ధం. ఇలా రెండో ఖాతా తెరిస్తే దాన్ని 'ఇర్రెగ్యులర్ అకౌంట్'గా పరిగణిస్తారు. అలాంటి సందర్భంలో రెండో ఖాతాకు ఎలాంటి వడ్డీ లభించదు. ఒకవేళ వేర్వేరు బ్యాంకుల్లో పొరపాటున రెండు పీపీఎఫ్ ఖాతాలు తెరిచి ఉంటే, వాటిని ఒకటిగా విలీనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధిత అధికారులను సంప్రదించి అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలి.

Details

రెండో ఖాతాకు వడ్డీ లభించదు

ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటే, వాటిలో ఒకదాన్ని మూసివేయడం ఉత్తమం. ప్రైమరీ (మొదటి) పీపీఎఫ్ ఖాతాకే వడ్డీ వర్తిస్తుంది. రెండో ఖాతాకు వడ్డీ లభించదు. అయితే రెండో ఖాతాలో ఉన్న మొత్తాన్ని మొదటి ఖాతాలోకి బదిలీ చేసుకునే సౌకర్యం ఉంది. అలాగే 18 ఏళ్ల లోపు మైనర్ల పేరుతో తల్లిదండ్రులు ప్రత్యేక పీపీఎఫ్ ఖాతా ప్రారంభించుకునే అవకాశం కూడా అందుబాటులో ఉంది.

Advertisement