
Unified Pension Scheme: ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏకీకృత పెన్షన్ పథకం.. అర్హతలు సహా వివరాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
చాలా కాలంగా ఎదురుచూస్తున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) అమలుకు సంబంధించి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) కీలక నిర్ణయం తీసుకుంది.
UPS అమలుకు అవసరమైన రెగ్యులేషన్స్‌ను జారీ చేస్తూ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రస్తుతం నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) పరిధిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం రూపొందించిన ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏప్రిల్ 1, 2025 నుంచి అమలులోకి రానుంది.
నోటిఫికేషన్ ప్రకారం,కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు UPSకి అర్హులు,కానీ కొన్ని ముఖ్యమైన షరతులు ఉన్నాయి.
ఏప్రిల్ 1, 2025 నాటికి సర్వీసులో ఉండి ఇప్పటికే NPSలో ఉన్నవారు మాత్రమే దీనికి అర్హులు.
వివరాలు
ఏకీకృత పెన్షన్ పథకానికి ఎవరు అర్హులు?
అలాగే,ఆ తేదీ తర్వాత కొత్తగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరే వారు,విధుల్లో చేరిన 30 రోజుల్లోగా UPSలో చేరాలి.
మార్చి 31, 2025లోపు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నవారు కూడా UPSకి అర్హులే. ఒకసారి UPSలో చేరిన తర్వాత మళ్లీ పాత NPS లేదా ఇతర పెన్షన్ పథకాలకి మారే వీలు ఉండదు.
ఉద్యోగులు తమ బేసిక్ పే(Basic Pay)నుంచి 10% UPSకి కంట్రిబ్యూట్ చేయాలి.ఇది యూపీఎస్ సబ్‌స్క్రైబర్ PRAN ఖాతాలో క్రెడిట్ అవుతుంది.
కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగి కంట్రిబ్యూషన్‌కు సమానమైన మొత్తాన్ని జమ చేస్తుంది. అదనంగా చెల్లించేందుకు అవకాశం ఉంది.
బేసిక్ పే,డియర్‌నెస్ అలౌన్స్(DA)లో 8.5%వరకు అదనంగా చెల్లించవచ్చు.కనీసం 10సంవత్సరాలు ఉద్యోగం చేసిన వారు నెలకు రూ.10,000 పెన్షన్ పొందే అవకాశముంది.
వివరాలు
ఏకీకృత పెన్షన్ పథకం: మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు
పెన్షన్ లెక్కింపు విధానం ఉద్యోగి సర్వీసు కాలం ఆధారంగా ఉంటుంది. 25 సంవత్సరాలు లేదా అంతకు మించి సేవ చేసినవారికి, రిటైర్మెంట్ ముందు చివరి 12 నెలల కనీస వేతనం సరాసరి తీసుకుని, దాని 50% ను పెన్షన్‌గా చెల్లిస్తారు.
10 నుంచి 25 సంవత్సరాల మధ్య సేవ చేసినవారికి కనీసంగా రూ.10,000 పెన్షన్ అందుతుంది.
పెన్షనర్ మరణించినా, ఆయన జీవిత భాగస్వామికి 60% పెన్షన్ అందించబడుతుంది.
యూపీఎస్ రూల్స్ ప్రకారం ఉద్యోగులు, వారి కుటుంబాలకు డియర్‌నెస్ రిలీఫ్ (DA) వర్తిస్తుంది, అయితే ఇది పెన్షన్ మొత్తంపై ప్రభావం చూపదు.