Loading...
UPI: రోజూ రూ.లక్ష కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు.. అక్టోబరులో సరికొత్త రికార్డు
రోజూ రూ.లక్ష కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు.. అక్టోబరులో సరికొత్త రికార్డు

UPI: రోజూ రూ.లక్ష కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు.. అక్టోబరులో సరికొత్త రికార్డు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 02, 2026
08:07 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారా జరిగే చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పండగల కొనుగోళ్లు,ఆన్‌లైన్ ఆఫర్లు ఈ వృద్ధికి మరింత ఊతమిచ్చాయి. ఈ ఏడాది అక్టోబరులో మొత్తం 2,547 కోట్ల యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి. వీటి విలువ రూ.31.53 లక్షల కోట్లుగా ఉంది. అంటే రోజుకు సగటున రూ.లక్ష కోట్లకు పైగా విలువైన చెల్లింపులు జరిగాయి. యూపీఐ లావాదేవీల రోజువారీ సగటు విలువ రూ.లక్ష కోట్లను దాటడం ఇదే తొలిసారి. రోజుకు సగటున 82.2 కోట్ల లావాదేవీలు జరగడం కూడా మరో రికార్డు. గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే ఈసారి యూపీఐ లావాదేవీల సంఖ్య 23 శాతం పెరిగింది.

వివరాలు 

యూపీఐ చెల్లింపుల పెరుగుదలకు కారణం ఇదే..

2025 అక్టోబరులో 2,070 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. వాటి విలువ రూ.27.27 లక్షల కోట్లు. ఈ ఏడాది అక్టోబరులో లావాదేవీల విలువ కూడా 16 శాతం పెరిగింది.

అక్టోబరులో నవరాత్రులు, ఇ-కామర్స్ సంస్థలు ప్రకటించిన ప్రత్యేక ఆఫర్లు యూపీఐ చెల్లింపుల పెరుగుదలకు కారణమని అంచనా.

ప్రజలు రోజువారీ అవసరాల కోసం మాత్రమే కాకుండా, పండగల సందర్భంగా వస్తువుల కొనుగోళ్లకు కూడా యూపీఐని విస్తృతంగా వినియోగించారు.

వివరాలు 

యూపీఐ చెల్లింపుల పెరుగుదలకు కారణం ఇదే..

ఈ ఏడాది సెప్టెంబరులో 2,406 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వాటి మొత్తం విలువ రూ.29.37 లక్షల కోట్లు.

ఆగస్టులో 2,450 కోట్ల లావాదేవీలు నమోదవగా, వాటి విలువ రూ.29.82 లక్షల కోట్లుగా ఉంది.

ఈ గణాంకాలతో పోలిస్తే అక్టోబరులో యూపీఐ వినియోగం మరింత పెరిగినట్లు స్పష్టమవుతోంది.

ఇదిలా ఉండగా, వ్యక్తుల నుంచి కొందరు వ్యాపారులకు జరిగే చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించాలన్న ప్రతిపాదనపై చర్చ కొనసాగుతోంది.

ఈ ప్రతిపాదన దీపావళి తర్వాత అమల్లోకి వస్తుందా? లేదా? అన్నది వేచి చూడాల్సి ఉంది.

ADVERTISEMENT