Loading...
US holdings in India: భారత్‌లో అమెరికా పెట్టుబడులు 390 బిలియన్‌ డాలర్లు.. చైనా కంటే అధికం
భారత్‌లో అమెరికా పెట్టుబడులు 390 బిలియన్‌ డాలర్లు.. చైనా కంటే అధికం

US holdings in India: భారత్‌లో అమెరికా పెట్టుబడులు 390 బిలియన్‌ డాలర్లు.. చైనా కంటే అధికం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 01, 2026
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో అమెరికా పెట్టుబడుల పరిమాణం మరోసారి పెరిగింది. 2025 చివరి నాటికి భారత సెక్యూరిటీల్లో అమెరికా పెట్టుబడుల విలువ 390బిలియన్‌ డాలర్లకు చేరింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.33 లక్షల కోట్లకు సమానం.అమెరికా ట్రెజరీ విభాగం విడుదల చేసిన ప్రాథమిక గణాంకాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2024 చివరి నాటికి భారత సెక్యూరిటీల్లో అమెరికా పెట్టుబడుల విలువ 383బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఏడాది వ్యవధిలో మరో 7 బిలియన్‌ డాలర్లు పెరిగింది. దీంతో మొత్తం పెట్టుబడుల్లో సుమారు 1.8 శాతం వృద్ధి నమోదైంది. అమెరికా పెట్టుబడిదారులు భారత్‌లో ప్రధానంగా స్టాక్‌ మార్కెట్‌పైనే దృష్టి పెట్టారు. 2025 చివరి నాటికి భారత ఈక్విటీల్లో అమెరికా పెట్టుబడుల విలువ 380 బిలియన్‌ డాలర్లకు చేరింది.

వివరాలు 

దీర్ఘకాలిక రుణ పత్రాల్లోనూ పెరుగుదల

2024లో ఈ విలువ 373 బిలియన్‌ డాలర్లుగా ఉండేది. అంటే ఏడాదిలో ఈ విభాగంలోనూ 7 బిలియన్‌ డాలర్ల పెరుగుదల కనిపించింది.

భారత్‌ జారీ చేసిన దీర్ఘకాలిక రుణ పత్రాల్లో అమెరికా పెట్టుబడులు 2025 చివరి నాటికి 11 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

2024 చివర్లో ఈ పెట్టుబడుల విలువ 10 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

మరోవైపు స్వల్పకాలిక రుణ పత్రాల్లో అమెరికా పెట్టుబడులు 500 మిలియన్‌ డాలర్ల కంటే తక్కువగానే ఉన్నాయి.

అయితే ఈ గణాంకాలు ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తు చేస్తున్నాయి.

అమెరికా పెట్టుబడిదారుల వద్ద ఉన్న భారత సెక్యూరిటీల మార్కెట్‌ విలువ మాత్రమే ఇందులో లెక్కలోకి వచ్చింది.

వివరాలు 

చైనాను వెనక్కి నెట్టిన భారత్

భారత్‌లో కర్మాగారాలు, మౌలిక వసతులు లేదా ఇతర భౌతిక ఆస్తులపై అమెరికా సంస్థలు చేసిన ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు (FDI) ఇందులో చేర్చలేదు.

అమెరికా పెట్టుబడులను ఆకర్షిస్తున్న దేశాల జాబితాలో భారత్‌ 12వ స్థానంలో నిలిచింది.

2024లోనూ భారత్‌ ఇదే ర్యాంకులో కొనసాగింది. అయితే మొత్తం పెట్టుబడుల విషయంలో భారత్‌ చైనాను స్పష్టంగా అధిగమించింది.

2025 చివరి నాటికి భారత్‌లో అమెరికా పెట్టుబడుల విలువ 390 బిలియన్‌ డాలర్లు కాగా.. చైనాలో 318 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

అంటే చైనాతో పోలిస్తే భారత్‌లో అమెరికా పెట్టుబడులు 72 బిలియన్‌ డాలర్లు ఎక్కువగా ఉన్నాయి.

దక్షిణ కొరియాలోని 384 బిలియన్‌ డాలర్ల అమెరికా పెట్టుబడులతో పోల్చినా భారత్‌ స్వల్పంగా ముందంజలో ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగిన పెట్టుబడులు

ప్రపంచవ్యాప్తంగా అమెరికా పెట్టుబడుల విలువ కూడా భారీగా పెరిగింది.

2025 చివరి నాటికి అమెరికా పెట్టుబడుల మొత్తం విలువ 19.3 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. 2024లో ఇది 15.8 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది.

ఈ మొత్తం పెట్టుబడుల్లో అత్యధికంగా 15.25 ట్రిలియన్‌ డాలర్లు విదేశీ ఈక్విటీల్లోనే ఉన్నాయి.

ADVERTISEMENT