Page Loader
Vistara pilot crisis: విస్తారాలో పైలట్ల కొరత.. 38 విమానాలు రద్దు
Vistara pilot crisis: విస్తారాలో పైలట్ల కొరత.. 38 విమానాలు రద్దు

Vistara pilot crisis: విస్తారాలో పైలట్ల కొరత.. 38 విమానాలు రద్దు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 02, 2024
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ విమానయాన సంస్థ విస్తారాను పైలట్ల కొరత పట్టి పీడిస్తోంది. సిబ్బంది లేమితో మంగళవారం ఉదయం వివిధ ప్రధాన నగరాల నుంచి బయలుదేరాల్సిన 38 విమానాలను రద్దు చేశారు. వీటిలో ముంబై నుంచి 15, ఢిల్లీ నుంచి 12, బెంగళూరు నుంచి 11 విమానాలు ఉన్నాయి. విమానాల రద్దు, ఆలస్యంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విస్తారా సంస్థ స్పందిస్తూ.. తమ వినియోగదారులకు కలిగిన అసౌకర్యం పట్ల క్షమాపణలు తెలిపింది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొంది. సోమవారం 50 విమానాల రద్దుతో పాటు మరో 160 విమానాలు ఆలస్యమయ్యాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పైలట్ల కొరతతో 38 విమానాలు రద్దు చేసిన విస్తారా