
Cognizant: కాగ్నిజెంట్‌లో 80శాతం ఉద్యోగులకు వేతనాల పెంపు.. అమలు తేదీ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ (Cognizant) 80 శాతం మంది అర్హులైన ఉద్యోగులకు వేతనాల పెంపును నిర్ణయిస్తూ గురువారం ప్రకటించింది. ఈ పెంపు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుందని తెలిపింది. ద్వితీయ త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించిన సంస్థ, ప్రతిభ ఆధారంగా 2025 ద్వితీయార్ధంలో జీతాల పెంపు అమలులోకి వస్తుందని పేర్కొంది. తాజా పెంపు సీనియర్ అసోసియేట్ స్థాయి వరకు వర్తిస్తుందని, వృద్ధి శాతం పనితీరు రేటింగ్‌పై ఆధారపడి ఉంటుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. భారత్‌లో నిరంతరం అద్భుత ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు హై సింగిల్ డిజిట్స్ (7, 8, 9 శాతం) వరకు వేతన వృద్ధి లభించే అవకాశం ఉంది.
Details
సంస్థలు వేతనాల పెంపులో వెనుకడుగు
ఈ ఏడాది ప్రారంభంలోనే అసోసియేట్లకు భారీ బోనస్‌లు ఇచ్చిన విషయం కూడా గుర్తుచేశారు. ఇటీవల టీసీఎస్ కూడా 80 శాతం మంది ఉద్యోగులకు వేతనాల పెంపు ప్రకటించిన విషయం తెలిసిందే. జూనియర్, మధ్యస్థాయి సిబ్బందిలో దాదాపు 80 శాతం మందికి పెంపు అమలవుతుందని తెలిపింది. అయితే, వృద్ధి శాతం వివరాలు వెల్లడించలేదు. ఆసక్తికరంగా, ఈ ఏడాదే 12 వేల మందిని తొలగించనున్నట్లు ప్రకటించిన టీసీఎస్ వేతనాల పెంపు ప్రకటించడం గమనార్హం. ఒకవైపు ఐటీ రంగంలో ఉద్యోగాల కోతలు కొనసాగుతుండగా, మరోవైపు పెద్ద సంస్థలు వేతనాల పెంపులో వెనుకడుగు వేయకపోవడం సానుకూల పరిణామంగా భావించొచ్చు.