Meta layoffs: మెటా ఉద్యోగానికి గుడ్‌బై చెప్పిన జూలీ బోన్.. కారణం ఏంటంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను భయపెడుతున్న అంశాల్లో లేఆఫ్స్ ఒకటి. ఉద్యోగం కోల్పోతామనే ఆందోళన చాలా మందిని మానసికంగా కుంగదీస్తోంది. తాజాగా మెటా సంస్థ చేపట్టిన భారీ పునర్వ్యవస్థీకరణలో వేలాది మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. ఈ క్రమంలో "మీ వస్తువులు తీసుకుని వెళ్లండి" అంటూ వచ్చిన మెయిల్స్ అనేక మందిని షాక్‌కు గురిచేశాయి. అయితే ఈ లేఆఫ్స్‌లో ఓ మాజీ ఉద్యోగిని మాత్రం స్వచ్ఛందంగా ఉద్యోగానికి రాజీనామా చేసి వార్తల్లో నిలిచింది.
వివరాలు
ఎవరు ఈ జూలీ బోన్?
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, లాస్ ఏంజెల్స్‌కు చెందిన జూలీ బోన్.. టెక్సాస్ ఏఅండ్‌ఎం యూనివర్సిటీ నుంచి బాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసింది. 2006లో మెట్రో వాషింగ్టన్ హోమ్ ఇంప్రూవ్‌మెంట్ మ్యాగజైన్‌లో ఫ్రీలాన్స్ ప్రూఫ్‌రీడర్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ది వాషింగ్టన్ టైమ్స్‌లో కాపీ ఎడిటర్‌గా చేరి, తర్వాత డిప్యూటీ ఎడిటర్, వెబ్ ఎడిటర్‌గా పదోన్నతి పొందింది. 2010లో ది వాషింగ్టన్ పోస్ట్‌లో మల్టీప్లాట్‌ఫామ్ ఎడిటర్‌గా చేరిన జూలీ.. అరబ్ స్ప్రింగ్ ఉద్యమం, అమెరికా అధ్యక్ష ఎన్నికలు వంటి కీలక అంశాల కవరేజీలో పని చేసింది. 2019లో సీనియర్ మల్టీప్లాట్‌ఫామ్ ఎడిటర్‌గా ప్రమోషన్ పొందింది. అనంతరం 2020లో మెటాలో చేరి, ఫేస్ బుక్‌కు కంటెంట్ డిజైనర్‌గా ఆరు సంవత్సరాలు పనిచేసింది.
వివరాలు
మెటా ఉద్యోగాన్ని ఎందుకు వదిలేసింది?
జూలీ బోన్ తెలిపిన ప్రకారం.. మెటా సంస్థ ఇప్పుడు పూర్తిగా "AI-ఫస్ట్" దిశగా ముందుకెళ్తోందని, అది తన వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాలకు సరిపోవడం లేదని పేర్కొంది. అందుకే స్వచ్ఛందంగా కంపెనీని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. లింక్డ్‌ఇన్‌లో చేసిన పోస్టులో "ఇది ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదు. చాలా కాలంగా మెటా లక్ష్యాలు, నా లక్ష్యాలు పూర్తిగా వేర్వేరు దారుల్లో ఉన్నాయని అనిపిస్తోంది. నా వ్యక్తిగత జీవితానికి కూడా ఇదే సరైన సమయం. నేను తప్పుకుంటే, అక్కడ కొనసాగాలనుకునే మరో ఉద్యోగికి అవకాశం దక్కొచ్చని భావించాను" అని తెలిపింది.
వివరాలు
మెటాలో మారుతున్న వర్క్ కల్చర్
మెటాలో ఇప్పుడు AI ఆధారిత నైపుణ్యాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని జూలీ వెల్లడించింది. ఉద్యోగులు AI టూల్స్‌తో ఐడియాలు రూపొందించడం, కోడింగ్ సమస్యలు పరిష్కరించడం, రిపిటేటివ్ పనులను ఆటోమేట్ చేయడం వంటి పనులు చేయాలని ప్రోత్సహిస్తున్నారని పేర్కొంది. అయితే AI టూల్స్ నేర్చుకోవడం మాత్రమే భవిష్యత్తులో ఉద్యోగ భద్రతకు హామీ కాదని కూడా ఆమె స్పష్టం చేసింది.
వివరాలు
"క్రియేటివిటీకి ఇంకా విలువ ఉంది"
మెటాలో తన అనుభవాల గురించి మాట్లాడిన జూలీ.. బ్రాండ్ వాయిస్, లోకలైజేషన్ పనుల్లో భాగమవడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పింది. ప్రస్తుతం కొంత విరామం తీసుకుని, తర్వాత కొత్త అవకాశాల కోసం చూస్తానని తెలిపింది. "స్పష్టమైన కమ్యూనికేషన్, బలమైన ఎడిటోరియల్ తీర్పు, సాంస్కృతిక అవగాహనకు ప్రాధాన్యం ఇచ్చే సంస్థల్లో పని చేయాలని ఉంది. ఇంకా క్రియేటివిటీకి విలువ ఉన్న చోట పని చేయాలనుకుంటున్నాను" అని పేర్కొంది. జూలీ నిర్ణయానికి నెటిజన్ల ప్రశంసలు జూలీ బోన్ తీసుకున్న నిర్ణయంపై లింక్డ్‌ఇన్ వినియోగదారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. "నువ్వు నీ నిర్ణయంతో బయటకు రావడం గొప్ప విషయం", "కొత్త అవకాశాల్లో కూడా నువ్వు రాణిస్తావు" అంటూ పలువురు అభినందనలు తెలిపారు.