LOADING...
wholesale inflation: టోకు ద్రవ్యోల్బణం వరుసగా 6 నెలలోనూ నెగిటివ్‌లోనే 
టోకు ద్రవ్యోల్బణం వరుసగా 6 నెలలోనూ నెగిటివ్‌లోనే

wholesale inflation: టోకు ద్రవ్యోల్బణం వరుసగా 6 నెలలోనూ నెగిటివ్‌లోనే 

వ్రాసిన వారు Stalin
Oct 16, 2023
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో టోకు ధరల ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో ప్రతికూల గణాంకాలను నమోదు చేసింది. టోకు ద్రవ్యోల్బణం నెగిటివ్‌గా నమోదు కావడం వరుసగా ఆరో నెల కావడం గమనార్హం. సెప్టెంబరు టోకు ద్రవ్యోల్బణం -0.26శాతానికి చేరింది. ఆగస్టులో ఇది -0.52శాతంగా ఉంది. అంతకుముందు జూలై నెలలో - 1.23 శాతంగా నమోదైందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక డేటా వెల్లడించింది. తొలిసారిగా ఈ ఏడాది ఏప్రిల్‌లో టోకు ద్రవ్యోల్బణం నెగిటివ్‌గా నమోదైంది. గతేడాది సెప్టెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 10.55 శాతంగా ఉండటం గమనార్హం. అయితే రసాయనాలు, రసాయనాల ఉత్పత్తులు, ఖనిజ చమురు, లోహాలు ధరలు, ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడం వల్లే సెప్టెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం తక్కువగా నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టోకు ద్రవ్యోల్బణం రిపోర్టు