LOADING...
Bank Loan: 30 ఏళ్ల లోన్‌ను 17 ఏళ్లలో క్లోజ్ చేయొచ్చు.. ఈ సూపర్ ట్రిక్ తెలుసుకోండి!
30 ఏళ్ల లోన్‌ను 17 ఏళ్లలో క్లోజ్ చేయొచ్చు.. ఈ సూపర్ ట్రిక్ తెలుసుకోండి!

Bank Loan: 30 ఏళ్ల లోన్‌ను 17 ఏళ్లలో క్లోజ్ చేయొచ్చు.. ఈ సూపర్ ట్రిక్ తెలుసుకోండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 02, 2026
03:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

చాలామంది సొంత ఇల్లు అనే కలను నిజం చేసుకోవడానికి బ్యాంకుల నుంచి గృహ రుణాలు తీసుకుంటారు. కానీ ఆ రుణాన్ని తిరిగి చెల్లించే సమయంలోనే అసలు భారమేమిటో అర్థమవుతుంది. రుణాన్ని త్వరగా, సులభంగా ఎలా తీర్చుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా గృహ రుణాలపై బ్యాంకులు అధిక వడ్డీ రేట్లు విధిస్తాయి. దీంతో రుణాన్ని పూర్తిగా చెల్లించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఈ పరిస్థితిలో 30 సంవత్సరాల గృహ రుణాన్ని 17 సంవత్సరాల్లోనే ఎలా తీర్చుకోవచ్చు? అలాగే వడ్డీ భారం ఎలా తగ్గించుకోవచ్చు? అనే విషయాలను పరిశీలిద్దాం.

వివరాలు

వడ్డీ తగ్గే అవకాశం

ఉదాహరణకు, ఒక వ్యక్తి రూ.50 లక్షల గృహ రుణం తీసుకున్నారని అనుకుందాం. దానిపై 8 శాతం వడ్డీ రేటు, 30 సంవత్సరాల గడువు ఉంటే నెలవారీ EMI సుమారు రూ.36,688 అవుతుంది. అయితే అదే రుణాన్ని 20 సంవత్సరాల్లో తీర్చాలని నిర్ణయించుకుంటే నెలవారీ EMI సుమారు రూ.41,822 వరకు పెరుగుతుంది. ఇలా రుణ కాలాన్ని 30 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలకు తగ్గిస్తే చెల్లింపు గడువు తగ్గడమే కాకుండా మొత్తం వడ్డీ కూడా గణనీయంగా తగ్గుతుంది. ఇంకా వేగంగా రుణాన్ని ముగించాలంటే మరో సులభమైన మార్గం ఉంది.

వివరాలు

సంవత్సరానికి 13 ఈఐఎంలు చెల్లించాలి

ప్రతి సంవత్సరం 12 నెలల EMIలకు అదనంగా ఒక EMI చెల్లిస్తే మరింత లాభం ఉంటుంది. అంటే సంవత్సరానికి 12 EMIలు కాకుండా 13 EMIలు చెల్లిస్తే, 30 సంవత్సరాల గృహ రుణాన్ని కేవలం 17 సంవత్సరాల్లోనే పూర్తి చేయవచ్చు. ఈ విధానాన్ని అనుసరించడం ద్వారా వడ్డీ భారాన్ని తగ్గించడంతో పాటు రుణాన్ని త్వరగా ముగించే అవకాశం ఉంటుంది.

Advertisement