Zepto: నెలకు రూ.99తో జప్టో క్లబ్ ప్రారంభం.. క్యాష్‌బ్యాక్‌తో ప్రత్యేక ప్రయోజనాలు
ఈ వార్తాకథనం ఏంటి
క్విక్ కామర్స్ సంస్థ జప్టో (Zepto) తన వినియోగదారుల కోసం 'జప్టో క్లబ్' (Zepto Club) పేరుతో కొత్త చెల్లింపు సభ్యత్వ పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సభ్యత్వం ఆహ్వానం (Invite) పొందిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా నెలకు రూ.99 చెల్లించి ఈ సభ్యత్వాన్ని పొందవచ్చు. ఇందులో క్యాష్‌బ్యాక్, ప్రాధాన్య డెలివరీ, ప్రత్యేక డిస్కౌంట్లు వంటి పలు ప్రయోజనాలను కంపెనీ అందిస్తోంది. గతంలో ప్రవేశపెట్టిన జెప్టో పాస్ (Zepto Pass), జెప్టో డైలీ (Zepto Daily) సేవలను నిలిపివేసిన తర్వాత సంస్థ తీసుకొచ్చిన తాజా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఇదే.
వివరాలు
ప్రతి కొనుగోలుపై 5 శాతం క్యాష్‌బ్యాక్
జప్టో క్లబ్ సభ్యులకు రూ.99కు పైబడిన ప్రతి ఆర్డర్‌పై అపరిమిత ఉచిత డెలివరీ లభిస్తుంది.
అలాగే ప్రతి కొనుగోలుపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను Z-Coins రూపంలో వినియోగదారుల ఖాతాలో జమ చేస్తారు.
అంతేకాకుండా ఆర్డర్లకు ప్రాధాన్య ప్యాకింగ్,వేగవంతమైన డెలివరీ,ప్రాధాన్య కస్టమర్ సపోర్ట్,ఎంపిక చేసిన ఉత్పత్తులు,ప్రత్యేక డీల్స్‌కు ముందస్తు యాక్సెస్ వంటి సదుపాయాలు కూడా ఈ సభ్యత్వంలో ఉంటాయి.
జప్టోకు ఇది సబ్‌స్క్రిప్షన్ వ్యాపారంలో మూడో ప్రయత్నం. మొదట ప్రారంభించిన జప్టో పాస్ ద్వారా ఉచిత డెలివరీలు,డిస్కౌంట్లు అందించగా, అనంతరం తక్కువ ధరలో జెప్టో డైలీ సభ్యత్వాన్ని తీసుకొచ్చింది.
అయితే వినియోగదారుల సేవలను పునర్వ్యవస్థీకరించే క్రమంలో ఆ రెండు పథకాలను నిలిపివేసింది. ఇప్పుడు జెప్టో క్లబ్‌లో క్యాష్‌బ్యాక్‌తో పాటు ప్రాధాన్య సేవలను కూడా జోడించింది.
వివరాలు
ప్రీమియం కిరాణా విభాగంపై జప్టో దృష్టి
ప్రీమియం గ్రోసరీ విభాగంలో తన వ్యాపారాన్ని విస్తరించడంపై కూడా జప్టో దృష్టి పెట్టింది.
ఈ నేపథ్యంలో దిగుమతి చేసిన వస్తువులు, గోర్మెట్ ఉత్పత్తులతో 'సెలెక్ట్' (Select) పేరుతో ప్రత్యేక ప్రీమియం గ్రోసరీ విభాగాన్ని ప్రారంభించేందుకు సంస్థ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
క్విక్ కామర్స్ రంగంలో ప్రీమియం గ్రోసరీ విభాగంపై పోటీ రోజురోజుకూ పెరుగుతోంది.
వివరాలు
ప్రీమియం కిరాణా విభాగంపై జప్టో దృష్టి
మరోవైపు స్విగ్గీ బ్లాక్ (Swiggy Black) వంటి పోటీ సంస్థల సభ్యత్వ సేవలకు ప్రత్యామ్నాయంగా జప్టో క్లబ్‌ను తీసుకొచ్చినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం బ్లింకిట్ (Blinkit), స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ (Swiggy Instamart), ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ (Flipkart Minutes), బిగ్‌బాస్కెట్ (BigBasket), అమెజాన్ నౌ (Amazon Now) వంటి సంస్థల మధ్య పోటీ తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో, కేవలం వేగవంతమైన డెలివరీలకే పరిమితం కాకుండా కస్టమర్లను నిలబెట్టుకునేందుకు కొత్త సభ్యత్వ పథకాలు, అదనపు ప్రయోజనాలపై కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి.