Sridhar Vembu: వ్యాపారంలో సక్సెస్ కావాలంటే ఈ నైపుణ్యం తప్పక ఉండాలి: శ్రీధర్ వెంబు
ఈ వార్తాకథనం ఏంటి
వ్యాపారం చేయాలనుకునే ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, వైద్యులు ముందుగా సేల్స్ నేర్చుకోవాలని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సూచించారు. ఉత్పత్తి ఎంత నాణ్యమైనదైనా.. దాని గురించి కస్టమర్లకు స్పష్టంగా వివరించి, వారు కొనుగోలు చేసేలా నమ్మకం కల్పించడం వ్యాపార విజయానికి చాలా కీలకమని చెప్పారు. ఇటీవల 'ఎక్స్'లో చేసిన ఓ పోస్టులో శ్రీధర్ వెంబు తన అభిప్రాయాలను వెల్లడించారు. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకునే వారు వీలైనంత ఎక్కువగా సేల్స్ కాల్స్‌లో పాల్గొనాలని సూచించారు. కస్టమర్ల నుంచి తిరస్కరణ ఎదురైనప్పటికీ నిరుత్సాహపడకుండా ప్రయత్నాన్ని కొనసాగించాలని చెప్పారు.
వివరాలు
సేల్స్ కాల్స్‌లో తిరస్కరణను ఎదుర్కోవాలని సలహా
సేల్స్ చేసే సమయంలో ఎదురయ్యే పరిస్థితులు ఎన్నో విషయాలను నేర్పిస్తాయని వేంబు పేర్కొన్నారు.
మన ఆలోచన ఎంత గొప్పదైనా.. దాన్ని ఎదుటివారికి సులభంగా అర్థమయ్యేలా వివరించడం అంత తేలికైన విషయం కాదని సేల్స్ అనుభవంలోనే తెలుస్తుందని చెప్పారు.
ఇలాంటి అనుభవాల ద్వారా కమ్యూనికేషన్ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు.
సేల్స్‌లో ప్రత్యక్ష అనుభవం ఉంటేనే ఆ విభాగంలో పనిచేసే ఉద్యోగులు ఎదుర్కొనే కష్టాలు, సవాళ్లు కూడా అర్థమవుతాయని శ్రీధర్ వేంబు అన్నారు.
వ్యాపారంలో అమ్మకాలు లేకుండా ముందుకు సాగడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆయన చేసిన సూచనపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ తమ సొంత అనుభవాలను కూడా పంచుకున్నారు.
వివరాలు
ప్రోగ్రామింగ్ విధానాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది: వెంబు
మరోవైపు.. వ్యాపారాలపై పెరుగుతున్న టెక్నాలజీ ఖర్చుల గురించి కూడా వేంబు ఇటీవల స్పందించారు.
కృత్రిమ మేధ (AI) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో మెమరీ ధరలు, ఏఐ టోకెన్ ఖర్చులు పెరుగుతున్నాయని తెలిపారు.
ఈ పరిస్థితుల్లో సాఫ్ట్‌వేర్ రంగం మరింత సమర్థమైన ప్రోగ్రామింగ్ విధానాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
శ్రీధర్ వెంబు చేసిన ట్వీట్
If you are an engineer or scientist or doctor turning to business, the first thing I would suggest is "Please go on a lot of sales calls, face rejection if necessary, but persist".
— Sridhar Vembu (@svembu) August 26, 2026
You will develop better communication skills as you realise that explaining your ideas is not so…