Page Loader
The Rajasaab: 120 రోజుల షెడ్యూల్, 300 రోజుల వీఎఫ్ఎక్స్ వర్క్.. రాజాసాబ్ ఆలస్యంపై ప్రొడ్యూసర్ స్పష్టత
120 రోజుల షెడ్యూల్, 300 రోజుల వీఎఫ్ఎక్స్ వర్క్.. రాజాసాబ్ ఆలస్యంపై ప్రొడ్యూసర్ స్పష్టత

The Rajasaab: 120 రోజుల షెడ్యూల్, 300 రోజుల వీఎఫ్ఎక్స్ వర్క్.. రాజాసాబ్ ఆలస్యంపై ప్రొడ్యూసర్ స్పష్టత

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 17, 2025
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

హారర్ కామెడీతో మిక్స్ అయిన ఫాంటసీ డ్రామాగా రూపొందిన ప్రభాస్ "ది రాజా సాబ్" సినిమా ఈ ఏడాది అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూసిన చిత్రాల్లో ఒకటి. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం, వింటేజ్ ప్రభాస్ లుక్‌లో ఉంటుందనే విషయంతోనే ముందుగా హైప్‌ను క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదాలు పడుతూ వస్తున్న నేపథ్యంలో, తాజాగా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. జూన్ 16న హైదరాబాద్‌లో జరిగిన టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో వారు సినిమా ఆలస్యానికి గల అసలు కారణాలపై స్పందించారు.

Details

భారీ వీఎఫ్ఎక్స్ కారణంగా ఆలస్యం

ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా చిత్ర నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, సినిమా విడుదల ఆలస్యం వెనక ప్రధాన కారణం క్లైమాక్స్‌లో వాడిన భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్ వర్క్ అని చెప్పారు. "రాజాసాబ్ చివరి 40 నిమిషాల క్లైమాక్స్ కోసం మేం ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేశాం. ఆ క్లైమాక్స్ షెడ్యూల్‌ ఒక్కటే 120 రోజుల పాటు సాగింది. అదే సమయంలో వీఎఫ్ఎక్స్ పనులకు 300 రోజులు పట్టింది. ఇది సాధారణ విషయం కాదు. అలాంటి విజువల్స్‌ను ఇప్పటి వరకూ మన ఇండియన్ సినిమాల్లో చూడలేదని ఆయన వివరించారు.

Details

120 రోజుల షెడ్యూల్ - 18 గంటల పనితనం

దర్శకుడు మారుతి షెడ్యూల్ మేనేజ్‌మెంట్ గురించి కూడా విశ్వప్రసాద్ ప్రస్తావించారు. "ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10-11 గంటల వరకు డైలీ షూటింగ్ జరిగింది. అలా 120 రోజులపాటు ఒకే షెడ్యూల్ కొనసాగింది. ఈ స్థాయి పని తీరుతోనే అద్భుతమైన సినిమా రూపుదిద్దుకుందని తెలిపారు. అలాగే మారుతి కూడా ఈ విషయాన్ని సమర్థిస్తూ, రోజుకి 16-18 గంటలపాటు పనిచేశాం. రెండు షిఫ్టుల్లో నటీనటులతో వర్క్ చేశాం. ఆ విధంగా మాత్రమే ఈ సినిమాను సకాలంలో పూర్తి చేయగలిగామని చెప్పారు.

Details

డిస్నీ స్థాయి చిత్రంగా రాజాసాబ్

ఈ సినిమాను భారతీయ సినీ పరిశ్రమలో డిస్నీ తరహాలో రూపొందించాలన్నదే తన లక్ష్యమని, హాలీవుడ్ స్థాయిలో విజువల్స్‌తో భారతీయ కథను మిళితం చేసి రూపొందించిన చిత్రమిదని టీజీ విశ్వప్రసాద్ అభిప్రాయపడ్డారు. వీఎఫ్ఎక్స్ విషయంలో రాజాసాబ్‌కు ఎంత ప్రాధాన్యత ఇచ్చామో చెప్పడానికే ఈ ఆలస్యం తలెత్తిందని ఆయన స్పష్టం చేశారు. టీజర్‌పై భారీ స్పందన సహనిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ, "ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చరిత్రను తిరగరాస్తుంది. 2023 డిసెంబర్‌లో 'యానిమల్', 2024 డిసెంబర్‌లో 'పుష్ప 2' హిట్ అయినట్లే, 2025 డిసెంబర్ మొదటి వారాన్ని 'రాజాసాబ్' శాసిస్తుంది" అని ధీమాగా చెప్పారు.

Details

స్టార్ కాస్ట్, భాషల వెర్షన్లు

ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. 'రాజాసాబ్' ఆలస్యం వెనక ఉన్న కారణాలు ఒక్కటే - హైక్వాలిటీ విజువల్స్‌తో అద్భుతమైన క్లైమాక్స్ అందించాలన్న ధ్యేయం. డిసెంబర్ 5న థియేటర్లలోకి అడుగుపెట్టబోయే ఈ చిత్రం ఇప్పటికే టీజర్‌తో ఊహించదగిన స్థాయి హైప్‌ను సృష్టించడంతో, బాక్సాఫీస్‌పై ప్రభాస్ మ్యాజిక్ ఎలా ఉంటుందో చూడాలి.