Pawan kalyan-Allu Aravind: పవన్ కళ్యాణ్ తొలి సినిమాకు 30 ఏళ్లు.. ప్రత్యేక పోస్ట్ పెట్టిన అల్లు అరవింద్!
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ డిప్యూటీ సీఎం, అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణంలో 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. పవన్ కల్యాణ్‌తో కలిసి చేసిన తొలి సినిమా జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ అభినందనలు తెలియజేశారు. సినీ రంగంలో ఆయన సాగించిన ప్రయాణాన్ని ప్రశంసించడంతోపాటు, సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా సమాజం కోసం పవన్ చేస్తున్న సేవలను కూడా ప్రత్యేకంగా కొనియాడారు. అల్లు అరవింద్ తన పోస్ట్‌లో.. 'ప్రియమైన పవన్ కళ్యాణ్.. మనం కలిసి చేసిన తొలి సినిమా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'కి అప్పుడే 30 ఏళ్లు పూర్తయ్యాయంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది.
వివరాలు
పవన్ కళ్యాణ్ తొలి సినిమా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'
సినీ పరిశ్రమలో మీది ఒక అద్భుతమైన ప్రయాణం.
30 వసంతాలు పూర్తి చేసుకున్నందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఎంచుకున్న ఏ మార్గంలోనైనా మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని రాసుకొచ్చారు.
పవన్ కల్యాణ్, నటి సుప్రియ యార్లగడ్డ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మించారు.
వివరాలు
మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష
1996లో విడుదలైన ఈ చిత్రంతోనే పవన్ కల్యాణ్, సుప్రియ కథానాయకుడు, కథానాయికగా తెరంగేట్రం చేశారు.
ఈ సినిమా విడుదలై మూడు దశాబ్దాలు పూర్తయిన నేపథ్యంలో అల్లు అరవింద్ చేసిన ప్రత్యేక పోస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది.
పవన్ కల్యాణ్ సినీ ప్రయాణంతోపాటు, ప్రజా జీవితంలోనూ ఆయన మరిన్ని విజయాలు సాధించాలని నిర్మాత ఆకాంక్షించారు.