Loading...
Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి అంతర్జాతీయ గుర్తింపు.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
శ్రీశైలం జలాశయానికి అంతర్జాతీయ గుర్తింపు.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి అంతర్జాతీయ గుర్తింపు.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 12, 2026
04:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీశైలం జలాశయానికి అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్ఠాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈ జలాశయానికి చోటు దక్కింది. ఈ గుర్తింపుతో దేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి ప్రాజెక్టుగా శ్రీశైలం జలాశయం నిలిచింది. ఈ సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సౌత్ రీజినల్ జాయింట్ సెక్రటరీ ఇలియాజర్.. శ్రీశైలం ఎమ్మెల్యేకు, ఇరిగేషన్ అధికారులకు సర్టిఫికెట్లు అందజేశారు. భారీ గేట్లతో ప్రత్యేక గుర్తింపు దక్షిణాసియాలో మరే ఇతర ప్రాజెక్టులోనూ లేని విధంగా శ్రీశైలం జలాశయంలో 60అడుగుల వెడల్పు, 55 అడుగుల ఎత్తు కలిగిన గేట్లు ఉన్నాయి. ఈ ప్రత్యేకతే జలాశయానికి అంతర్జాతీయ గుర్తింపు రావడంలో కీలకంగా నిలిచింది. జలాశయ నిర్మాణం,సాంకేతిక సామర్థ్యం,భారీ వరదలను తట్టుకునే పటిష్టతకు ఈ గుర్తింపు నిదర్శనంగా నిలుస్తోంది.

వివరాలు 

2009 వరదలను తట్టుకున్న పటిష్ట నిర్మాణం

2009లో శ్రీశైలం ప్రాంతంలో భారీ వరదలు సంభవించాయి.

ఆ సమయంలో జలాశయం రికార్డు స్థాయిలో 25.4లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని తట్టుకుని నిలిచింది.

ఇంతటి భారీ వరద ప్రవాహాన్ని ఎదుర్కొన్నప్పటికీ జలాశయం ప్రదర్శించిన సామర్థ్యం, నిర్మాణ పటిష్టత దాని ప్రత్యేకతను చాటిచెప్పాయి.

ఈ అంశాలు జలాశయం సాంకేతిక సామర్థ్యానికి ప్రాధాన్యాన్ని తీసుకొచ్చాయి.

ఇంజనీర్లు, ఇరిగేషన్ అధికారులకు అభినందనలు

శ్రీశైలం జలాశయానికి ఈ గుర్తింపు లభించిన సందర్భంగా శ్రీశైలం ఎమ్మెల్యే స్పందించారు.

ఆనాడు డ్యామ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఇంజనీర్ల కృషిని కొనియాడారు.

జలాశయానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కేలా కృషి చేసిన ఇరిగేషన్ అధికారులను అభినందించారు.

ఈ అంతర్జాతీయ గుర్తింపు శ్రీశైలం జలాశయానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చిందని పేర్కొన్నారు.

ADVERTISEMENT