OTT Movies: ఓటీటీలో అదరగొడుతున్న సినిమాలివే..
ఈ వార్తాకథనం ఏంటి
ఓటీటీలో ప్రస్తుతం పలు ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. యాక్షన్, థ్రిల్లర్, డ్రామా, ఫాంటసీ.. ఇలా విభిన్న జానర్లలో తెరకెక్కిన సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా ఓటీటీలో ట్రెండ్ అవుతున్న నాలుగు చిత్రాలు, వాటి కథాంశాలేంటో ఓసారి చూద్దాం. కాన్ సిటీ : ఓ కుటుంబానికి చెందిన చిన్నారి అనూహ్యంగా కిడ్నాప్ అవుతాడు. అసలు ఆ బాలుడిని ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు చేశారు? అనే విషయాలను తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులు అన్వేషణ మొదలుపెడతారు. వెలుగులోకి వచ్చే స్కామ్‌లు, డ్రామాతో కథ ఆసక్తికరంగా సాగుతుంది. క్రైమ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో యోగి బాబు కామెడీ, అర్జున్ దాస్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
వివరాలు
మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్..
తొంభైల నాటి ప్రముఖ సూపర్‌హీరో పాత్ర 'హీ-మాన్' ఆధారంగా తెరకెక్కిన భారీ బడ్జెట్ లైవ్ యాక్షన్ చిత్రమిది.
అటర్నియా అనే మాయా ప్రపంచాన్ని కాపాడేందుకు హీరో హీ-మాన్‌గా మారతాడు.
తన ప్రధాన శత్రువు స్కెలిటర్‌తో అతను చేసే పోరాటమే ఈ సినిమా ప్రధాన కథ.
ఎపిక్ ఫాంటసీ అడ్వెంచర్‌గా రూపొందిన ఈ చిత్రంలో తెలుగు వెర్షన్‌కు మరో ప్రత్యేకత ఉంది.
హీ-మాన్ పాత్రకు టాలీవుడ్ హీరో నిఖిల్ డబ్బింగ్ చెప్పారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
వివరాలు
ది ఈస్ట్ ప్యాలెస్..
ఓ రాజమహల్‌లో యువరాజులు వరుసగా ప్రాణాలు కోల్పోతుంటారు. ఇదంతా ఓ దుష్టాత్మ పనేనని మహారాజు భావిస్తాడు.
ఆ ఆత్మను అంతం చేసేందుకు దెయ్యాలను వేటాడే ఓ వ్యక్తిని రాజ్యంలోకి రప్పిస్తాడు.
అయితే ఆ ప్యాలెస్‌లో దాగి ఉన్న భయంకరమైన రహస్యాలేంటి? అసలు ఆ దుష్టాత్మను వారు ఎలా ఎదుర్కొన్నారు? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సిరీస్ సాగుతుంది.
హిస్టారికల్ కొరియన్ డార్క్ ఫాంటసీ మిస్టరీ సిరీస్‌గా రూపొందిన 'ది ఈస్ట్ ప్యాలెస్' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
వివరాలు
హైజాక్ 1971..
ఇదొక రియలిస్టిక్ సర్వైవల్ థ్రిల్లర్. 1971లో జరిగిన కొరియన్ ఫ్లైట్ హైజాక్ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
విమానాన్ని ఎవరు హైజాక్ చేశారు? ఆ సమయంలో ప్రయాణికులు ఎలాంటి భయానక పరిస్థితులను ఎదుర్కొన్నారు?
విమానాన్ని సురక్షితంగా కిందకు దించేందుకు పైలట్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? అనే అంశాలను ఉత్కంఠభరితంగా చూపించారు. ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.