8 Vasantalu: ప్రేమికుల రోజున కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన మైత్రి సంస్థ.!
మను సినిమాకి దర్శకత్వం వహించిన యువ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టితో ప్రముఖ పాన్-ఇండియన్ ప్రొడక్షన్ హౌస్, మైత్రీ మూవీ మేకర్స్, ప్రేమికుల రోజున కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. అదే "8 వసంతాలు". 365 రోజులకి అంకెలతో కొలిస్తే సంవత్సరం అదే అనుభవాలతో కొలిస్తే వసంతం అంటూ తమ టైటిల్ కి జస్టిఫికేషన్ గా బ్యూటిఫుల్ లైన్ తో అయితే చిత్రాన్ని అనౌన్స్ చేశారు. నవీన్ యెర్నేని,వై రవి శంకర్‌లు నిర్మించిన ఈ చిత్రానికి టైటిల్, పోస్టర్ ఆసక్తిని రేకెత్తించాయి. నటీనటులు,సాంకేతిక సిబ్బందికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి చెయ్యనున్నారు.