Team India: వరుస విజయాలకు బ్రేక్.. టీమిండియా సెమీస్‌కు చేరాలంటే ఇలా జరగాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత జట్టు 76 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమితో టీ20 ప్రపంచకప్ లో భారత్ వరుసగా సాధించిన 12 విజయాల జైత్రయాత్రకు బ్రేక్ పడింది. అంతేకాకుండా సెమీఫైనల్స్ అవకాశాలు కొంత క్లిష్టంగా మారాయి. అయితే పూర్తిగా దారులు మూసుకుపోలేదు. కానీ ప్రస్తుత ఆటతీరు మారకపోతే ముందుకు సాగడం కష్టమే.
Details
రెండు మ్యాచ్‌లు గెలిస్తే...
భారత్‌పై విజయం సాధించిన దక్షిణాఫ్రికా 2 పాయింట్లతో గ్రూప్ 1లో అగ్రస్థానంలో నిలిచింది. భారీ పరాజయంతో భారత్ నెట్ రన్‌రేట్ -3.800కి పడిపోయింది. సూపర్ 8లో భారత్ ఇంకా జింబాబ్వే, వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలవాలి. అలా జరిగితే భారత్ ఖాతాలో 4 పాయింట్లు చేరతాయి. అదే సమయంలో జింబాబ్వే, వెస్టిండీస్ జట్లలో ఏదీ 4 పాయింట్లకు చేరకపోతే భారత్ నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది.
Details
ఒకే మ్యాచ్ గెలిస్తే...
మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఒక్కదానిలో మాత్రమే గెలిస్తే పరిస్థితి మరింత సంక్లిష్టమవుతుంది. * ఈ సందర్భంలో దక్షిణాఫ్రికా తన మిగతా రెండు మ్యాచ్‌ల్లో తప్పకుండా గెలవాలి. వెస్టిండీస్-జింబాబ్వే మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టును భారత్ ఓడించాలి. అప్పుడు భారత్, జింబాబ్వే, వెస్టిండీస్ జట్ల ఖాతాల్లో చెరో రెండు పాయింట్లు ఉంటాయి. ఈ దశలో మెరుగైన నెట్ రన్‌రేట్ ఉన్న జట్టే సెమీఫైనల్స్‌కు చేరుతుంది. కాబట్టి టీమ్ ఇండియాకు ఇప్పుడు నెట్ రన్‌రేట్ కీలకంగా మారింది. మిగిలిన మ్యాచ్‌ల్లో కేవలం విజయం సాధించడం మాత్రమే కాకుండా భారీ తేడాతో గెలవడం కూడా అత్యంత అవసరం.