Loading...
this week telugu movies: ఈ వారం థియేటర్లలో థ్రిల్, యాక్షన్ జాతర.. మిస్ కాకూడని 5 సినిమాలివే!
ఈ వారం థియేటర్లలో థ్రిల్, యాక్షన్ జాతర.. మిస్ కాకూడని 5 సినిమాలివే!

this week telugu movies: ఈ వారం థియేటర్లలో థ్రిల్, యాక్షన్ జాతర.. మిస్ కాకూడని 5 సినిమాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2026
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ వారం సినీ ప్రేక్షకులకు వినోదం డబుల్ డోస్‌గా అందనుంది. థియేటర్లలో పలు ఆసక్తికర చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుండగా, ఓటిటి వేదికలపై కూడా కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్, లోకేశ్ కనగరాజ్, ఆర్. మాధవన్ చిత్రాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

వివరాలు

'కొరియన్ కనకరాజు'తో వరుణ్ తేజ్

వరుణ్ తేజ్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన కామెడీ హారర్ థ్రిల్లర్ 'కొరియన్ కనకరాజు' ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రితికా నాయక్ హీరోయిన్‌గా నటించగా, సత్య కీలక పాత్ర పోషించారు.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఒకే శరీరంలో రెండు ఆత్మలు ఉంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే కాన్సెప్ట్‌ను వినోదాత్మకంగా చూపించనున్నారు.

వరుణ్ తేజ్-సత్యల కామెడీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

వివరాలు

గ్యాంగ్‌స్టర్ డ్రామా 'కేజేక్యూ: కింగ్.. జాకీ.. క్వీన్'

దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడిక్ క్రైమ్ డ్రామా 'కేజేక్యూ: కింగ్.. జాకీ.. క్వీన్' కూడా ఆగస్టు 7న విడుదల కానుంది.

కేకే దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.

ADVERTISEMENT

వివరాలు

హీరోగా లోకేశ్ కనగరాజ్

'ఖైదీ', 'విక్రమ్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేశ్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఆయన ప్రధాన పాత్రలో నటించిన 'డీసీ' చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. వామికా గబ్బీ కథానాయికగా నటించారు.

రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం కూడా ఆగస్టు 7న విడుదల కానుంది. ప్రతీకారం నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.

ADVERTISEMENT

వివరాలు

జి.డి నాయుడు జీవితంతో 'జి.డి.ఎన్'

విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఆర్. మాధవన్ కీలక పాత్రలో నటించిన **'జి.డి.ఎన్'** కూడా ఆగస్టు 7న థియేటర్లలోకి రానుంది.

కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రముఖ భారతీయ ఆవిష్కర్త జి.డి నాయుడు జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కించారు.

బ్రిటిష్ పాలన కాలంలో పారిశ్రామిక విప్లవానికి ముందే భవిష్యత్తును మార్చాలనే జి.డి నాయుడు చేసిన పోరాటాన్ని ఈ చిత్రంలో చూపించనున్నట్లు ప్రచార చిత్రాలు తెలియజేస్తున్నాయి.

వివరాలు

'అనకాపల్లి'తో విక్రమ్ సహిదేవ్

విక్రమ్ సహిదేవ్ హీరోగా ఖగేశ్ తమ్మినేని దర్శకత్వంలో రూపొందిన **'అనకాపల్లి'** చిత్రం కూడా ఆగస్టు 7న విడుదల కానుంది.

దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు కాండ్రేగుల నాయుడుతో కలిసి నిర్మించారు.

సంధ్యా వశిష్ఠ కథానాయికగా నటించగా, తారక్ పొన్నప్ప, ఇంద్రజ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

వివరాలు

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్

హృదయం మురళి (తమిళ్‌, తెలుగు మూవీ) - ఆగస్టు 7

ఆపరేషన్ సఫేద్ సాగర్ (వెబ్‌సిరీస్‌) - ఆగస్టు 7

మై వాపస్ ఆవూంగా (మూవీ) - ఆగస్టు 7

ది సూపర్ మారియో గెలాక్సీ (మూవీ) - ఆగస్టు 7

ది లాస్ట్ హౌస్ (వెబ్‌సిరీస్‌) - ఆగస్టు 7

బిగ్ చికెన్: ఎ ఫాస్ట్ ఫుడ్ కాన్సిరసీ (వెబ్‌సిరీస్‌) - ఆగస్టు 7

లవ్ హర్ట్స్ (మూవీ) - ఆగస్టు 7 * అవర్ స్క్రిక్ట్‌లీ లవ్ (కొరియన్/ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 7

వివరాలు

జీ5

వంద దేవుళ్లు (తమిళ్‌, తెలుగు మూవీ) - ఆగస్టు 7

లెనిన్ (తెలుగు మూవీ) - ఆగస్టు 7

అమెజాన్ ప్రైమ్ వీడియో

ఓ సుకుమారి (మూవీ) - ఆగస్టు 7

వదంతి: సీజన్ 2 (వెబ్‌సిరీస్‌) - ఆగస్టు 7

జియో హాట్‌స్టార్

ఉయిర్ (మలయాళం/తెలుగు మూవీ) - ఇప్పటికే స్ట్రీమింగ్‌లో ఉంది.

సింప్లీసౌత్

కాట్టలాన్ (మూవీ) - ఆగస్టు 7

ADVERTISEMENT