Loading...
upcoming telugu movies: దసరా సినిమాల జాతర.. థియేటర్లలో కొత్త చిత్రాలు, ఓటీటీలోనూ వినోదాల విందు!
దసరా సినిమాల జాతర.. థియేటర్లలో కొత్త చిత్రాలు, ఓటీటీలోనూ వినోదాల విందు!

upcoming telugu movies: దసరా సినిమాల జాతర.. థియేటర్లలో కొత్త చిత్రాలు, ఓటీటీలోనూ వినోదాల విందు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2026
05:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

దసరా పండుగ సందర్భంగా సినీ ప్రేక్షకులను అలరించేందుకు పలు కొత్త సినిమాలు సిద్ధమవుతున్నాయి. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన 'జైలర్‌ 2' నుంచి విజయ్‌ దేవరకొండ 'రణబాలి' వరకు పలు ఆసక్తికర చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. యాక్షన్‌ థ్రిల్లర్‌లు, కుటుంబ కథా చిత్రాలు, బయోపిక్‌లు ఇలా విభిన్న కథాంశాలతో రూపొందిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ సినిమాల విశేషాలు, విడుదల తేదీలపై ఓ లుక్కేద్దాం.

వివరాలు

జైలర్‌ 2

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా, నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'జైలర్‌'కు కొనసాగింపుగా 'జైలర్‌ 2' రూపొందుతోంది.

ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 15న తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఎస్‌.జే. సూర్య, మిథున్‌ చక్రవర్తి, సూరజ్‌ వెంజరమూడి, విద్యా బాలన్‌ వంటి ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

వివరాలు

రణబాలి

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా, రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం 'రణబాలి'.

మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్‌ సమర్పిస్తోంది. రష్మిక కథానాయికగా నటిస్తుండగా, ఆర్నాల్డ్‌ వోస్లూ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.

1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్‌ పాలనా కాలంలో చోటుచేసుకున్న కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

దసరా సందర్భంగా అక్టోబరు 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ADVERTISEMENT

వివరాలు

క్రేజీ కళ్యాణం

నరేశ్‌ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్‌ భాస్కర్, అఖిల్‌ ఉడ్డేమారి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'క్రేజీ కళ్యాణం'. భద్రప్ప గాజుల దర్శకత్వం వహించిన ఈ సినిమాను బూసం జగన్‌మోహన్‌ రెడ్డి నిర్మించారు.

దసరా సందర్భంగా ఈ నెల 16న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. యువతతోపాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని సినీ వర్గాలు వెల్లడించాయి.

దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ADVERTISEMENT

వివరాలు

నయీ నవేలి

యామీ గౌతమ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'నయీ నవేలి'. బాలాజీ మోహన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆనంద్‌ ఎల్‌. రాయ్, హిమాన్షు శర్మ నిర్మించారు.

అద్దినాథ్‌ కొఠారే, మిటా వశిష్ఠ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కొత్త కోడలు మోహిని ఇంట్లోకి అడుగుపెట్టగానే కుటుంబంలో అంతా మంచే జరుగుతుందని ఇంటి సభ్యులు భావిస్తారు.

అయితే, వచ్చిన వదిన ఒక మంత్రగత్తె అంటూ ఆమె గురించి కుటుంబ సభ్యులను నమ్మించేందుకు మరిది ప్రయత్నిస్తుంటాడు.

ఇంతకీ ఆ కొత్త కోడలు నిజంగానే మంత్రగత్తెనా? లేక వరాలు ఇచ్చే దేవతా? అన్నదే ఈ చిత్ర కథాంశం. ఈ సినిమా ఈ నెల 16న థియేటర్లలో విడుదల కానుంది.

వివరాలు

ప్రహార్

26/11 ముంబయి ఉగ్రదాడుల నేపథ్యంలో అజ్మల్‌ కసబ్‌ కేసు విచారణలో నేరాన్ని నిరూపించే ఆధారాలు ఉన్నప్పటికీ, అతడికి ఉరిశిక్ష విధించడానికి కోర్టుకు ఎందుకు ఇన్నేళ్లు పట్టిందనే ప్రశ్నకు సమాధానంగా రూపొందుతున్న చిత్రం 'ప్రహార్‌'.

ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ ఉజ్వల్‌ నికమ్‌ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. ప్రముఖ న్యాయవాది ఉజ్వల్‌ నికమ్‌ జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

అవినాశ్‌ అరుణ్‌ దర్శకత్వం వహిస్తుండగా, దినేష్‌ విజన్‌ నిర్మిస్తున్నారు. వామికా గబ్బి కథానాయికగా నటిస్తున్నారు.

సికందర్‌ ఖేర్, జైదీప్‌ అహ్లావత్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా అక్టోబరు 16న విడుదల కానుంది.

వివరాలు

గరివిడి లక్ష్మి

ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'గరివిడి లక్ష్మి'. ఇందులో ఆనంది ప్రధాన పాత్ర పోషించారు.

గౌరినాయుడు జమ్ము దర్శకత్వం వహించారు. టి.జి. విశ్వప్రసాద్, కృతిప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. అక్టోబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. నరేశ్, రాగ్‌ మయూర్, శరణ్య ప్రదీప్‌ తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు.

వివరాలు

ఓటీటీలో అలరించనున్న చిత్రాలు/సిరీస్‌లు

అమెజాన్‌ప్రైమ్‌

లవ్‌ ఆఫ్‌ యువర్‌ లైఫ్‌ (మూవీ) అక్టోబరు 14

మాస్టర్‌ ప్లాన్‌ (మూవీ) అక్టోబరు 16

స్క్రీమ్‌ సీజన్‌7 (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 16

నెట్‌ఫ్లిక్స్‌

శాక్రిఫైస్‌ (మూవీ) అక్టోబరు 16

సీరియస్లీ టు సింగిల్‌ (మూవీ) అక్టోబరు 16

థెరపీ డన్‌ రైట్‌ (మూవీ) అక్టోబరు 16

డిప్లోమాట్‌ సీజన్‌4 (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 16

ADVERTISEMENT