Mega 157: చిరంజీవి కొత్త సినిమా నుంచి మెగా కబురు.. ఇక అడ్వెంచరే
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి తన 157వ సినిమాను బింబిసార దర్శకుడు వశిష్టతో చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి మెగా కబురు వచ్చేసింది. చిరంజీవితో ఉన్న ఫోటో షేర్ చేస్తూ వశిష్ట ఒక ట్వీట్ చేశాడు.
ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభమయ్యాయని, ఇక అడ్వెంచర్ మొదలుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని దర్శకుడు వశిష్టతో ట్వీట్ లో పేర్కొన్నారు.
ఈ సినిమాలో డీఓపీ(Director Of Photography)గా చోట కె.నాయుడు పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు వెల్లడించే అవకాశముంది.
మెగా 157, సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. యువీ క్రియేషన్స్ నిర్మించబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
డైరెక్టర్ వశిష్ట చేసిన ట్వీట్
A MEGA Start to the MEGA Film 🌟#MEGA157 is coming to life as we kick-off the pre-production works!
— Vassishta (@DirVassishta) September 10, 2023
We are ready to take you all on a cinematic adventure soon!@KChiruTweets @UV_Creations @NaiduChota pic.twitter.com/6qXLlsbqds