Shankar & Murugadoss : మురుగదాస్ స్టోరీతో శంకర్ దర్శకత్వంలో సినిమా? ఇండస్ట్రీలో క్రేజీ బజ్!
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ చిత్రసీమలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ, తమదైన విజన్‌తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఇద్దరు దిగ్గజ దర్శకులు ఇప్పుడు చేతులు కలపబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్, మాస్ కమర్షియల్ డైరెక్టర్ ఎ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్‌లో ఓ అత్యంత భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనుందనే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ బిగ్గెస్ట్ కొలాబరేషన్‌లో రూపొందనున్న భారీ సినిమాకి ఎ.ఆర్. మురుగదాస్ పవర్‌ఫుల్ కథను అందించనుండగా.. దర్శకుడు శంకర్ దాన్ని బిగ్ స్క్రీన్‌పై తనదైన శైలిలో ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు
సామాజిక అంశాలను, బలమైన సందేశాన్ని భారీ విజువల్స్‌తో కమర్షియల్ హంగులు జోడించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో శంకర్, మురుగదాస్ ఇద్దరూ దిట్ట.
ఒకరు అందించే స్ట్రాంగ్ స్క్రిప్ట్, కథనానికి.. మరొకరి అత్యున్నత మేకింగ్, గ్రాండ్ విజువల్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల తుఫాను తప్పదని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న ఈ ఇద్దరు మాస్టర్‌మైండ్స్.. బలమైన కంబ్యాక్ ఇవ్వాలనే లక్ష్యంతోనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
వివరాలు
ప్రేక్షకుల్లో ఇప్పటినుంచే ఆసక్తి
ఇద్దరు ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్లు ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడం అత్యంత అరుదైన విషయం కావడంతో.. ఈ క్రేజీ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఇప్పటినుంచే ఆసక్తి నెలకొంది.
ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌లో నటించబోయే నటీనటుల కాస్టింగ్, ఇతర ప్రొడక్షన్ వివరాలపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరి ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడు శంకర్ సాలిడ్ కంబ్యాక్ ఇస్తారా? శంకర్-మురుగదాస్ కాంబినేషన్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.