
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కోసం కొత్త కథ రెడీ.. ప్రొడ్యూసర్ క్లారిటీతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్
ఈ వార్తాకథనం ఏంటి
రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కొత్త సినిమాలకు సైన్ చేయకపోయినా, ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
పవన్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన 'గబ్బర్ సింగ్' భారీ హిట్ కావడంతో, వీరిద్దరి కాంబోలో రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'పై భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతుండటంతో రద్దు అయ్యిందనే వార్తలు కూడా వినిపించాయి.
ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ తాజా ఇంటర్వ్యూలో పవన్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే అప్‌డేట్ ఇచ్చారు.
ఆయన మాట్లాడుతూ 2025లో మా ఆరవ సినిమాగా పవన్ కళ్యాణ్ మూవీ విడుదల కానుంది.
Details
అధికారిక ప్రకటన రావాల్సి ఉంది
పవన్ సినిమా అంటే ఏ పాన్ ఇండియా బజ్ కూడా సరిపోదు. హరీష్ శంకర్ ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేశాడు. కథ ఓ రేంజ్‌లో ఉంది. పవన్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నాం.
ఈ ఏడాదిలో షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది విడుదల చేస్తామని వెల్లడించారు. అయితే, గతంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం విజయ్ తేరి రీమేక్ అని ప్రచారం జరిగింది.
కానీ బాలీవుడ్‌లో ఆ రీమేక్ ఫ్లాప్ కావడంతో, హరీష్ శంకర్ స్క్రిప్ట్‌ను పూర్తిగా మార్చి, కొత్త కథను సిద్ధం చేశాడని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.