Kollywood: తెలుగులోనే కాదు తమిళంలోనూ సంక్రాంతి పోటీ.. పొంగల్ బరిలో మూడు భారీ సినిమాలు!
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు.. సినిమా పండుగ కూడా. అందుకే స్టార్ హీరోల నుంచి చిన్న సినిమాల వరకు వీలైనన్ని చిత్రాలను సంక్రాంతి బరిలో నిలిపేందుకు నిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు. ప్రతేడాది కనీసం నాలుగు సినిమాలైనా టాలీవుడ్ నుంచి సంక్రాంతికి విడుదలవుతుంటాయి. ఇప్పుడు 2027 సంక్రాంతి పండుగ కోసం కూడా టాలీవుడ్‌లో అప్పుడే సందడి మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి నుంచి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వరకు దాదాపు ఐదారు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే వచ్చే సంక్రాంతికి తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమలోనూ ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వివరాలు
సంక్రాంతి బరిలో ఆర్య 'వెట్టువం'..
పొంగల్ పండుగను టార్గెట్ చేస్తూ కోలీవుడ్ మేకర్స్ కూడా తమ సినిమాల విడుదల తేదీలను ఖరారు చేస్తున్నారు.
ఇప్పటికే మూడు భారీ చిత్రాలు 2027 సంక్రాంతి రేసులో నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. తమిళ దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'వెట్టువం' తాజాగా విడుదల తేదీని ఖరారు చేసుకుంది.
ఆర్య హీరోగా, శోభితా ధూళిపాళ్ల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో భారీ తారాగణం భాగమవుతోంది. ఈ చిత్రాన్ని 2027 జనవరి సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 'వరల్డ్ ఆఫ్ వెట్టువం' ఇంట్రడక్షన్ వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
వివరాలు
రజనీకాంత్ 'ధర్మన్' కూడా పొంగల్‌కేనా?
పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్.. ఇలా మూడు వేర్వేరు కాలాల నేపథ్యంలో దర్శకుడు పా. రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
దీంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'ధర్మన్' సినిమా కూడా 2027 సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పండుగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సిమ్రాన్, రాశీ ఖన్నా, మన హీరో రామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూళ్లను విజయవంతంగా పూర్తి చేశారు.
వివరాలు
మణిరత్నం 'ఇంజి వెల్లమ్' కూడా సిద్ధం!
తమిళ మీడియా కథనాల ప్రకారం ఈ చిత్రం 2027 సంక్రాంతికి విడుదల కావడం దాదాపు ఖాయమని తెలుస్తోంది.
ప్రముఖ దర్శకుడు మణిరత్నం సైతం తన సినిమాను 2027 జనవరిలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
'ఇంజి వెల్లమ్' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. లవ్ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.
ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కోల్‌కతా నేపథ్యంలో సున్నితమైన భావోద్వేగాలతో కూడిన కథాంశంతో తెరకెక్కుతోంది.
చాలా కాలం తర్వాత మణిరత్నం మళ్లీ ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ చిత్రంపై ఆసక్తి కనిపిస్తోంది.
వివరాలు
తెలుగు, తమిళ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ!
ఈ సినిమా కూడా 2027 సంక్రాంతికే థియేటర్లలోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇలా కోలీవుడ్ నుంచి ఇప్పటికే మూడు భారీ చిత్రాలు 2027 పొంగల్ బరిలో నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి.
వీటితో పాటు మరో చిన్న సినిమా కూడా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ఈ మూడు తమిళ చిత్రాలు తెలుగులోనూ డబ్బింగ్ రూపంలో విడుదల కానున్నాయి.
ఇప్పటికే టాలీవుడ్ నుంచి ఐదారు సినిమాలు సంక్రాంతి రేసులో ఉండగా.. తమిళ చిత్రాలు కూడా తోడైతే తెలుగు బాక్సాఫీస్ వద్ద పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.
మొత్తంగా చూస్తే 2027 సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు దాదాపు ఏడెనిమిది సినిమాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.