Loading...
Jatayu : 'రామాయణం' నుంచి అదిరిపోయే అప్‌డేట్.. జటాయువు పాత్రలో అనుపమ్ ఖేర్!
'రామాయణం' నుంచి అదిరిపోయే అప్‌డేట్.. జటాయువు పాత్రలో అనుపమ్ ఖేర్!

Jatayu : 'రామాయణం' నుంచి అదిరిపోయే అప్‌డేట్.. జటాయువు పాత్రలో అనుపమ్ ఖేర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2026
04:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'రామాయణం: పార్ట్‌ 1' (Ramayana: Part 1) నుంచి కీలక అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ధైర్యానికి, ధర్మానికి ప్రతీకగా నిలిచే జటాయువు పాత్రకు ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ తన గాత్రాన్ని అందించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా జటాయువు పాత్రకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. రామాయణంలో జటాయువు ఘట్టానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. రావణాసురుడు సీతాదేవిని అపహరించుకుని వెళ్తున్న సమయంలో ఆమెను రక్షించేందుకు జటాయువు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడుతుంది. ఈ ఘట్టం ఇతిహాసంలోని అత్యంత భావోద్వేగభరితమైన సందర్భాల్లో ఒకటిగా నిలుస్తుంది.

వివరాలు

నవంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల

అలాంటి శక్తివంతమైన పాత్రకు అనుపమ్‌ ఖేర్‌ గాత్రం అందించనుండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

'రామాయణం: పార్ట్‌ 1' చిత్రాన్ని 2026 నవంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్‌ రావణాసురుడిగా నటిస్తున్నారు. ఇక సన్నీ డియోల్‌ హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు.

భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

వివరాలు

అక్టోబర్‌ 20 నుంచి అడ్వాన్స్‌ బుకింగ్స్‌?

సినిమాపై నెలకొన్న అంచనాల నేపథ్యంలో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనే ఆసక్తి అభిమానుల్లో ఉంది.

చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్‌ బుకింగ్స్‌ను అక్టోబర్‌ 20న దసరా పండుగ సందర్భంగా ప్రారంభించనున్నట్లు సమాచారం.

జటాయువు పాత్రకు అనుపమ్‌ ఖేర్‌ గాత్రం అందిస్తున్నారనే తాజా ప్రకటనతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

ఇతిహాసంలోని కీలక ఘట్టాలను భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.

మరి ఈ 'రామాయణం' ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

ADVERTISEMENT