Rashmika: జపాన్ ప్రేమకు ఫిదా.. రష్మిక మందన్న ఎమోషనల్ పోస్ట్ వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
నేషనల్ క్రష్ రష్మిక మందన్న పాపులారిటీ ఇప్పుడు దేశాలను మాత్రమే కాకుండా ఖండాలను కూడా దాటింది. ఇటీవలే అల్లు అర్జున్ సరసన నటించిన 'పుష్ప 2: ది రూల్' చిత్రం భాషకు పరిమితి లేకుండా గ్రాండ్ హిట్ అవ్వడం తెలిసిందే. ఈ విజయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లుతూ, ఈ సినిమాను జపాన్‌లో 'పుష్ప క్రునిన్' పేరుతో విడుదల చేశారు. అక్కడి ప్రేక్షకులు కూడా రష్మిక నటనతో మైండ్ బ్లో అయ్యారు. సినిమా ప్రచార కార్యక్రమాల కోసం జపాన్ వెళ్లిన రష్మికను అక్కడి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. జపాన్ పర్యటనలో ఎదురైన ప్రేమ, అభిమానంతో రష్మిక మధుర స్మృతులను సోషల్ మీడియాలో పంచుకుంది.
Details
ఎంత ఎమోషనల్ అయ్యానో మాటల్లో చెప్పలేను
అక్కడి అభిమానులు చూపిన అంతులేని ప్రేమను చూసి ఆమె కళ్ళు చెమర్చాయని కూడా తెలిపింది. రష్మిక తన పోస్ట్‌లో ఇలా చెప్పింది. జపాన్‌లో కేవలం ఒక్క రోజు మాత్రమే ఉన్నాను, కానీ ఆ తక్కువ సమయంలోనే నాకు లభించిన ప్రేమ వెలకట్టలేనిది. అక్కడి అభిమానులు నాకు ఎన్నో ప్రేమలేఖలు, అందమైన బహుమతులు ఇచ్చారు. వాటన్నింటినీ చదివినప్పుడు నేను ఎంత ఎమోషనల్ అయ్యానో మాటల్లో చెప్పలేను. ఆ బహుమతులన్నీ జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకున్నానని చెప్పారు.
Details
సోషల్ మీడియాలో వైరల్
అంతేకాదు రష్మిక త్వరలో మళ్ళీ జపాన్ రావాలని, ఈసారి ఎక్కువ రోజులు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే వచ్చేసారి జపనీస్ భాష నేర్చుకుంటానని తన అభిమానులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం 'మైసా' వంటి భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న రష్మిక చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది, అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.