Loading...
Aamir Khan : కంబ్యాక్ కోసం ఆమిర్ ఖాన్‌ భారీ ప్లాన్‌.. సూపర్‌హీరోగా వస్తాడా?
కంబ్యాక్ కోసం ఆమిర్ ఖాన్‌ భారీ ప్లాన్‌.. సూపర్‌హీరోగా వస్తాడా?

Aamir Khan : కంబ్యాక్ కోసం ఆమిర్ ఖాన్‌ భారీ ప్లాన్‌.. సూపర్‌హీరోగా వస్తాడా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 15, 2026
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

వరుస విజయాలతో షారుఖ్‌ ఖాన్‌ దూసుకెళ్తుండగా.. సాలిడ్‌ కంబ్యాక్‌ కోసం సల్మాన్‌ ఖాన్‌ తన సినిమాలపై ఫోకస్‌ పెంచారు. అయితే ఈ ఖాన్‌ త్రయంలో ఒకరైన ఆమిర్‌ ఖాన్‌ మాత్రం ప్రస్తుతం కాస్త నెమ్మదించినట్లే కనిపిస్తున్నారు. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌గా పేరు తెచ్చుకున్న ఆమీర్‌ ఖాన్‌కు ప్రస్తుతం కాలం అంతగా కలిసిరావడం లేదు. వరుస పరాజయాలు ఈ బాలీవుడ్‌ స్టార్‌ కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. ప్రయోగాత్మక చిత్రాలతో పాటు నిర్మాతగా వ్యవహరించిన సినిమాలు సైతం బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. నిజానికి 2016లో విడుదలైన 'దంగల్‌' తర్వాత ఆమిర్‌ ఖాన్‌ ఖాతాలో ఒక్క హిట్‌ కూడా పడలేదు భారీ అంచనాలతో వచ్చిన 'లాల్‌ సింగ్‌ చద్దా' సైతం డిజాస్టర్‌గా మిగిలింది.

వివరాలు

మెయిన్‌ లీడ్‌లో ఒక్క సినిమా కూడా చేయలేదు

ఆ తర్వాత ఆయన మెయిన్‌ లీడ్‌లో ఒక్క సినిమా కూడా చేయలేదు.

గతేడాది విడుదలైన 'సితారే జమీన్‌ పర్‌' సినిమా ఓకే అనిపించినప్పటికీ.. 'తారే జమీన్‌ పర్‌' స్థాయిలో మాత్రం ప్రేక్షకుల నుంచి టాక్‌ రాలేదు.

2016 నుంచి ఇప్పటివరకు హీరోగా ఆమిర్‌ ఖాన్‌ నటించిన సినిమాలు కేవలం మూడే. మిగిలినవన్నీ క్యామియో పాత్రలు లేదా నిర్మాతగా ఆయన చేసిన సినిమాలే. అవి కూడా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి.

ఇక సౌత్‌లో సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ నటించిన 'కూలీ' సినిమాలో ఆమిర్‌ ఖాన్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించారు. అయితే ఆ సినిమా కూడా యావరేజ్‌గానే నిలిచింది.

వివరాలు

హిట్‌ కోసం ఎదురుచూపులు

ఒకప్పుడు తన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 'దంగల్‌', 'పీకే', 'త్రీ ఇడియట్స్‌' వంటి ఇండస్ట్రీ హిట్లతో బాలీవుడ్‌ను రూల్‌ చేసిన ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తన సినిమాలతో వందల కోట్ల వసూళ్లు సాధించిన ఈ బాలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఇప్పుడు గ్రేట్‌ కంబ్యాక్‌ కోసం సరైన ప్రాజెక్ట్‌ను ఎంచుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

హీరోగా కొంత గ్యాప్‌ తీసుకుని నిర్మాతగా చేసిన సినిమాలు కూడా ఆయనకు కలిసిరాలేదు.

'హ్యాపీ పటేల్‌ ఖతర్నాక్‌ జాసూస్‌', తన కుమారుడు జునైద్‌ ఖాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన 'ఏక్‌ దిన్‌', సన్నీడియోల్‌ నటించిన 'బట్వారా 1947' సినిమాలు కూడా ఈ ఏడాది ఆమిర్‌ ఖాన్‌ ఫ్లాప్‌ లిస్ట్‌లో చేరాయి.

ADVERTISEMENT

వివరాలు

సూపర్‌హీరోగా కంబ్యాక్‌?

వరుస పరాజయాలతో కెరీర్‌ గాడి తప్పడంతో ఈసారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్‌ కొట్టాలనే ప్లాన్‌లో ఆమిర్‌ ఖాన్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకొని సూపర్‌హీరో కాన్సెప్ట్‌తో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

ఈ సినిమాకు ఆర్‌. బాల్కి దర్శకత్వం వహించే అవకాశం ఉందని, సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

అయితే 'కూలీ' తర్వాత ఆమిర్‌ ఖాన్‌.. సూపర్‌హీరో కాన్సెప్ట్‌తోనే దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌తో సినిమా చేయాల్సి ఉందనే వార్తలు గతంలో వచ్చాయి.

కానీ ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ ఇంకా సిద్ధం కాలేదని తెలుస్తోంది.

ADVERTISEMENT

వివరాలు

ఆయనకు ఆసక్తి చూపినట్లు సమాచారం

ఇప్పటికే లోకేశ్‌ ఈ సినిమా లైన్‌ను ఆమిర్‌కు వినిపించగా.. ఆయన మాత్రం ఆసక్తి చూపినట్లు సమాచారం.

మరి చివరకు ఆమిర్‌ ఖాన్‌ ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారో.. ఎలాంటి సూపర్‌హీరోగా కనిపిస్తారో చూడాలి.

ఈసారి బ్లాక్‌బస్టర్‌ హిట్‌తో తన కెరీర్‌కు మరోసారి సాలిడ్‌ కంబ్యాక్‌ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT