Page Loader
Aamir Khan: ఆమీర్ ఖాన్ కొత్త ప్రేమకథ.. నూతన గర్ల్‌ఫ్రెండ్‌ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఆమీర్ ఖాన్ కొత్త ప్రేమకథ.. నూతన గర్ల్‌ఫ్రెండ్‌ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Aamir Khan: ఆమీర్ ఖాన్ కొత్త ప్రేమకథ.. నూతన గర్ల్‌ఫ్రెండ్‌ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 15, 2025
06:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌లో 'మిస్టర్ పర్ఫెక్షనిస్ట్' గా పేరుగాంచిన అమీర్ ఖాన్, తన సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత జీవితం కారణంగా కూడా తరచుగా వార్తల్లో నిలుస్తుంటాడు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకొని, తన భార్యలకు విడాకులిచ్చిన ఆమీర్ ఖాన్ ఇప్పుడు మళ్లీ ప్రేమలో పడినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన ప్రస్తుతం ఓ యువతితో డేటింగ్ చేస్తున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆ యువతి పేరు గౌరి. ఇటీవల తన 60వ పుట్టినరోజు సందర్భంగా, ఆమీర్ ఖాన్ ఈ కొత్త స్నేహితురాలిని పరిచయం చేశాడు. తాజాగా గౌరి కూడా ఆమీర్ ఖాన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Details

25 సంవత్సరాలుగా ఒకరికొకరు పరిచయం

ఆమీర్ ఖాన్ మాట్లాడుతూ, గౌరిలో తనకు నచ్చిన విషయం ఏమిటంటే, తనని ప్రశాంతంగా ఉంచి, మానసిక శాంతిని ఇచ్చే భాగస్వామి కోసం తాను వెతుకుతున్నానని, ఆ లక్షణాలు గౌరికి ఉన్నాయని చెప్పారు. ఇక గౌరి కూడా తన మనసులోని మాటను బయట పెట్టింది. తనకు మంచి మనసున్న వ్యక్తి కోసం వెతికే సమయంల ఆమీర్ ఖాన్‌ను కలిశానని ఆమె చెప్పింది. ఆమీర్ ఖాన్, గౌరి గత 25 సంవత్సరాలుగా ఒకరికొకరు తెలుసు. అయితే చాలా కాలం పాటు వారి మధ్య పెద్దగా సంభాషణలు జరగలేదు. తాము మళ్లీ ఒకటిన్నర సంవత్సరం క్రితం పరిచయమయ్యామని ఆమీర్ ఖాన్ చెప్పాడు.

Details

ఇద్దరి 15 సంవత్సరాల ఏజ్ గ్యాప్

గౌరి బెంగళూరులో పెరిగింది. ఆమెకు హిందీ సినిమాల కంటే సౌత్ సినిమాలపై ఆసక్తి ఎక్కువ. ఆమీర్ ఖాన్ 1965, మార్చి 14న జన్మించాడు, గౌరి 1978, ఆగస్టు 21న జన్మించింది. వారిద్దరి మధ్య దాదాపు 14 ఏళ్ల వయస్సు వ్యత్యాసం ఉంది. ఈ విషయం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.