NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Sitaare Zameen Par: ఆమిర్‌ఖాన్ 'సితారే జమీన్ పర్‌' ట్రైల‌ర్ ఈరోజు రాత్రి విడుదల
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Sitaare Zameen Par: ఆమిర్‌ఖాన్ 'సితారే జమీన్ పర్‌' ట్రైల‌ర్ ఈరోజు రాత్రి విడుదల
    ఆమిర్‌ఖాన్ 'సితారే జమీన్ పర్‌' ట్రైల‌ర్ ఈరోజు రాత్రి విడుదల

    Sitaare Zameen Par: ఆమిర్‌ఖాన్ 'సితారే జమీన్ పర్‌' ట్రైల‌ర్ ఈరోజు రాత్రి విడుదల

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 13, 2025
    01:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌గా పేరుగాంచిన ఆమిర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం పేరు 'సితారే జమీన్ పర్‌'. ఈ చిత్రానికి 'సబ్‌కా అప్న అప్న నార్మల్‌' అనే ఉపశీర్షికను ఎంచుకున్నారు.

    ప్రముఖ దర్శకుడు ఆర్‌ఎస్‌ ప్రసన్న ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

    కథానాయికగా జెనీలియా నటిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు ఆమిర్‌ ఖాన్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై, ఆమిర్‌ ఖాన్, అపర్ణ పురోహిత్ కలిసి చేపట్టారు.

    తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    వివరాలు 

    ట్రైలర్‌ రిలీజ్‌కు సంబంధించిన వివరాలు వెల్లడి 

    ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన చిత్రబృందం,తాజాగా ట్రైలర్‌ రిలీజ్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

    ఈరోజు రాత్రి 7:50 గంటలకు జీ నెట్‌వర్క్‌కు చెందిన చానళ్లలో,అలాగే రాత్రి 8:20కి సోషల్‌మీడియా వేదికలపై ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది.

    ఈ సందర్భంగా ఒక వీడియోను కూడా పంచుకుంది.ఇంతకుముందు, ఆమిర్‌ ఖాన్‌ నటించి, తనే దర్శకత్వం వహించిన 2007లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'తారే జమీన్ పర్‌' కి ఇది సీక్వెల్ అని ఆయన స్వయంగా ప్రకటించారు.

    అయితే ఈ సారి కథని హాస్యప్రధానంగా తీర్చిదిద్దినట్టు సమాచారం.దాదాపు మూడు సంవత్సరాల విరామం తరువాత ఆమిర్‌ ఖాన్ నటిస్తున్న సినిమా కావడంతో బాలీవుడ్‌లో ఈ చిత్రంపై అత్యధిక అంచనాలు నెలకొన్నాయి.

    వివరాలు 

    'సితారే జమీన్ పర్‌' సినిమాతోనే వెండితెరకు పరిచయం అవుతున్న తారలు వీరే..

    ఈ చిత్రంలో ఆరోష్ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్ జైన్, నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

    గమనించదగ్గ విషయం ఏమిటంటే, వీరందరూ 'సితారే జమీన్ పర్‌' సినిమాతోనే వెండితెరకు పరిచయం కావడం విశేషం.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    చిత్రబృందం చేసిన ట్వీట్ 

    Our Sitaare's are popping out of excitement as trailer drops tonight! #SitaareZameenPar Trailer Out Tonight on Zee Network Channels at 7:50-8:10pm & Aamir Khan Production’s Social Media Handles at 8:20pm.

    Watch #SitaareZameenPar #SabkaApnaApnaNormal, 20th June Only In… pic.twitter.com/Nw19GruR0d

    — Aamir Khan Productions (@AKPPL_Official) May 13, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బాలీవుడ్

    తాజా

    Sitaare Zameen Par: ఆమిర్‌ఖాన్ 'సితారే జమీన్ పర్‌' ట్రైల‌ర్ ఈరోజు రాత్రి విడుదల బాలీవుడ్
    CBSE Class 10 results: సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల.. అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకొండి ఇలా.. సీబీఎస్‌ఈ
    USA: అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్‌లు విధించాలని భారత్‌ నిర్ణయం అమెరికా
    upcoming movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు ఇదే.. సినిమా రిలీజ్

    బాలీవుడ్

    Aamir Khan-Gauri Spratt: ఆమిర్‌ఖాన్‌తో డేటింగ్‌ చేసే గౌరీ స్ప్రాట్‌ ఎవరు ..? సినిమా
    Aamir Khan: ఆమీర్ ఖాన్ కొత్త ప్రేమకథ.. నూతన గర్ల్‌ఫ్రెండ్‌ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ సినిమా
    Orry: చిక్కుల్లో ఇన్‌ఫ్లుయెన్సర్ ఓర్రీ.. వైష్ణో దేవి ఆలయం దగ్గర మద్యం సేవించడంపై ఎఫ్ఐఆర్ సినిమా
    WAR 2 : హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబో.. 'వార్ 2' విడుదలపై అధికారిక ప్రకటన వచ్చేసింది! జూనియర్ ఎన్టీఆర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025