Yash: సెట్‌లో టీలు అందించిన స్థాయి నుంచి.. నేడు పాన్ ఇండియా స్టార్‌గా యశ్!
ఈ వార్తాకథనం ఏంటి
''ఊరు చూడడానికి వచ్చినోడు ఊరు తెలుసుకుంటాడు.. ఊరు ఏలడానికి వచ్చినోడు వాడి గురించి ఊరికి తెలిసేలా చేస్తాడు!'' 'కేజీఎఫ్'లోని ఈ డైలాగ్ యశ్ జీవితానికి సరిగ్గా సరిపోతుంది. టీవీ సీరియల్స్‌తో కెరీర్ మొదలుపెట్టి.. నేడు పాన్ ఇండియా స్టార్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. యశ్ నటించిన 'టాక్సిక్' నేడు విడుదలైన సందర్భంగా ఆయన జీవితంలోని ఆసక్తికర విషయాలివీ. యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత యశ్‌గా పేరు మార్చుకున్నారు. అభిమానులు ఆయనను రాకింగ్ స్టార్, రాకీ భాయ్ అని ముద్దుగా పిలుచుకుంటారు.
వివరాలు
సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇలా..
యశ్ తండ్రి అరుణ్ కుమార్ బెంగళూరులో బీఎంటీసీ బస్సు డ్రైవర్‌గా పనిచేశారు.
తల్లి పుష్ప గృహిణి. డిగ్రీలో చేరిన యశ్.. సినిమాల్లో అవకాశాల కోసం చదువును మధ్యలోనే ఆపేశారు.
ఆ తర్వాత రంగస్థల నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. యశ్ తొలి సంపాదన రోజుకు కేవలం రూ.50. రంగస్థల నటులకు టీలు అందించే పని చేస్తూ ఆయన ఈ మొత్తాన్ని సంపాదించారు.
ఆ తర్వాత ఓ కన్నడ దర్శకుడి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు.
వివరాలు
బుల్లితెరపైకి ఎంట్రీ ఇలా..
2004లో 'ఉత్తరాయణ' సీరియల్‌తో యశ్ బుల్లితెరపైకి పరిచయమయ్యారు.
ఆ తర్వాత 'నంద గోకుల' వంటి టీవీ సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
2007లో విడుదలైన 'జంబద హుడుగి' సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. 'మొగ్గిన మనసు' సినిమాతో ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు.
నటుడిగానే కాకుండా సింగర్‌గానూ యశ్ తన ప్రతిభను చాటుకున్నారు.
'మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి', 'మాస్టర్‌పీస్' సినిమాల్లో పాటలు పాడారు. 'గూగ్లీ', 'మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి' సినిమాలతో యశ్ కన్నడనాట అగ్ర హీరోగా ఎదిగారు.
అయితే 'కేజీఎఫ్: చాప్టర్ 1', 'కేజీఎఫ్: చాప్టర్ 2' సినిమాలు ఆయనకు దేశవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌ను తీసుకొచ్చాయి.
వివరాలు
ఐదేళ్ల ప్రేమ..
ఇప్పటివరకు యశ్ 22 సినిమాల్లో నటించారు. 'మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి', 'కేజీఎఫ్: చాప్టర్ 1' సినిమాలకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ (సౌత్) అవార్డులతో పాటు పలు సైమా అవార్డులను అందుకున్నారు.
యశ్ తన సహనటి రాధిక పండిత్‌ను టీవీ సీరియల్స్‌లో కలిసి నటిస్తున్న సమయంలో కలిశారు.
ఆ పరిచయం ప్రేమగా మారింది. ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు.
ఈ దంపతులకు ఐరా, యథర్వ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వివరాలు
రావణుడి పాత్రలో యశ్..
రాధిక పండిత్‌కు తొలుత యశే ప్రపోజ్ చేశారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఆమెకు ఇష్టమైన వస్తువులతో కూడిన గిఫ్ట్ హ్యాంపర్‌ను సిద్ధం చేసి.. ఆమె కారుపై పెట్టి సర్‌ప్రైజ్ చేశారు.
'రామాయణ' సినిమాతో యశ్ నిర్మాతగానూ మారారు. ఈ సినిమాకు తొలిసారి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
మరోవైపు 'యశో మార్గ ఫౌండేషన్' ద్వారా రైతులకు సేవ చేస్తూ సామాజిక కార్యక్రమాల్లోనూ భాగస్వాములవుతున్నారు.
ఇక యశ్ తదుపరి 'రామాయణ' సినిమాలో రావణుడి పాత్రలో కనిపించనున్నారు.