Hyderabad: 'టాక్సిక్' ఈవెంట్‌లో ప్రమాదం.. మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యంపై కేసు!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ నటుడు రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ శనివారం మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రమాదం చోటుచేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. ఈవెంట్ జరుగుతుండగా ఒక్కసారిగా భారీ ఫ్లడ్‌లైట్ స్థంభం కుప్పకూలింది. అది ఇద్దరు యువకులపై పడటంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వివరాలు
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈవెంట్ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకోవడంతో పలువురికి గాయాలైనట్లు వెల్లడించారు.
మరోవైపు 'టాక్సిక్' చిత్ర బృందంపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, ఈవెంట్ నిర్వహణలో తీసుకున్న భద్రతా చర్యలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.