Page Loader
Rishab Shetty: 'కాంతార: చాప్టర్-1' షూటింగ్‌లో ప్రమాదం.. స్పందించిన చిత్రబృందం
'కాంతార: చాప్టర్-1' షూటింగ్‌లో ప్రమాదం.. స్పందించిన చిత్రబృందం

Rishab Shetty: 'కాంతార: చాప్టర్-1' షూటింగ్‌లో ప్రమాదం.. స్పందించిన చిత్రబృందం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2025
04:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిషబ్‌ శెట్టి నటిస్తున్న కాంతార: చాప్టర్-1 సినిమా చిత్రీకరణ సందర్భంగా కర్ణాటకలో ఓ ప్రమాదం చోటుచేసుకుంది. శివమొగ్గ జిల్లాలోని మాణియ పికప్‌ ఆనకట్ట వద్ద శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. షూటింగ్‌ కోసం నటీనటులు ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. అయితే అదృష్టవశాత్తూ ప్రమాద స్థలం కేవలం మూడు అడుగుల లోతు మాత్రమే ఉండడంతో, అందులో ఉన్న చిత్రబృంద సభ్యులు సురక్షితంగా బయటపడగలిగారు. ఈ ప్రమాద సమయంలో హీరో రిషబ్‌ శెట్టితోపాటు మరో పది మంది ఉన్నారు. వారందరూ సేఫ్‌గా బయటపడ్డారని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్‌ అధికారికంగా స్పష్టం చేసింది.

Details

ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు

ఈ ఘటనపై చిత్ర నిర్మాణం నుంచి కార్యనిర్వాహక నిర్మాత ఆదర్శ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. తీవ్రమైన వర్షం, బలమైన గాలుల కారణంగా పడవ అదుపుతప్పి బోల్తా పడిందని వివరించారు. సినిమా చిత్రీకరణలో అనుకోకుండా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో చిత్రబృందం ఊపిరిపీల్చుకుంది. కాంతార ఫ్రాంచైజీపై భారీ అంచనాలున్న నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి ప్రతి అప్‌డేట్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.