తదుపరి వార్తా కథనం

Mandadi : చెన్నై సముద్ర తీరంలో 'మండాడి' షూటింగ్‌లో ప్రమాదం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 05, 2025
12:44 pm
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ స్టార్ నటుడు సూరి, తెలుగు నటుడు సుహాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'మండాడి' సినిమా షూటింగ్ చెన్నై సముద్ర తీరంలో శరవేగంగా కొనసాగుతోంది. అయితే, షూటింగ్ సమయంలో దురదృష్టకరమైన అపశృతి సంభవించింది. సముద్రంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు సాంకేతిక నిపుణులతో ఉన్న పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదం రామనాథ్‌పురం జిల్లా, తొండి సముద్రతీర ప్రాంతంలో చోటుచేసుకుంది.
Details
ఇద్దరికి గాయాలు
ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. అదనంగా కోటీ రూపాయల విలువ చేసే కెమెరాలు, ఇతర సామాగ్రి నీటిలో మునిగిపోయాయి. అయితే యూనిట్ సభ్యులు వెంటనే రక్షణ చర్యలు చేపట్టి ప్రాణనష్టం తప్పించారు. సినిమాను జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్ నిర్మిస్తున్నారు. ఈ అపశృతి కారణంగా అతనికి ఊహించని ఆర్థిక నష్టం ఎదురైంది.