LOADING...
Prithviraj Sukumaran: యాక్షన్ సీన్స్ తర్వాత మరింత అప్రమత్తంగా ఉంటున్నా: పృథ్వీరాజ్ సుకుమారన్
యాక్షన్ సీన్స్ తర్వాత మరింత అప్రమత్తంగా ఉంటున్నా: పృథ్వీరాజ్ సుకుమారన్

Prithviraj Sukumaran: యాక్షన్ సీన్స్ తర్వాత మరింత అప్రమత్తంగా ఉంటున్నా: పృథ్వీరాజ్ సుకుమారన్

వ్రాసిన వారు Moogati Shabari
Jul 12, 2026
02:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో దర్శకుడు నిషమ్ బషీర్ రూపొందించిన తాజా చిత్రం 'ఐ, నోబడీ' విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ తన సినీ ప్రయాణం, యాక్షన్ సన్నివేశాల్లో ఎదురైన అనుభవాలు, అలాగే ఈ సినిమా ప్రత్యేకతల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. యాక్షన్ సన్నివేశాల్లో సాధ్యమైనంత వరకు డూప్‌ను ఉపయోగించకుండా స్వయంగా నటించడమే తనకు అలవాటని పృథ్వీరాజ్ చెప్పారు. అయితే 2023లో ఒక సినిమా చిత్రీకరణ సందర్భంగా యాక్షన్ సీన్ చేస్తుండగా తన ఎడమ మోకాలికి తీవ్ర గాయం అయిందని గుర్తు చేసుకున్నారు.

వివరాలు

సామాన్యుడు చేసే పోరాటం..

ఆ గాయం కారణంగా మూడు శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చిందని, ప్రస్తుతం తన ఎడమ కాలిలో మూడు టైటానియం స్క్రూలు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రమాదం వల్ల ఆ సినిమా షూటింగ్ దాదాపు ఏడాది పాటు నిలిచిపోయిందని, దాంతో నిర్మాతలకు సమయంతో పాటు భారీ ఆర్థిక నష్టం కూడా వాటిల్లిందని వెల్లడించారు. అప్పటి నుంచి యాక్షన్ సన్నివేశాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నానని చెప్పారు. అలాగే 'ఐ, నోబడీ' సినిమా ఒకే జానర్‌కు చెందిన కథ కాదని ఆయన వివరించారు. కథ ప్రారంభంలో బ్యాంక్ దోపిడీ సంఘటనతో మొదలై, అనంతరం సామాజిక అంశాలను స్పృశిస్తూ కిడ్నాప్ డ్రామాగా మలుపు తిరిగి, చివరికి ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా సామాన్యుడు చేసే పోరాటంగా సాగుతుందని చెప్పారు.

వివరాలు

సినిమాకు ప్రధాన ఆకర్షణ అదే..

ఈ చిత్రంలోని యాక్షన్ ఎపిసోడ్‌లను ఫ్రెంచ్ స్టంట్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ రూపొందించినట్లు తెలిపారు. సాధారణంగా ఉండే కట్ షాట్లకు భిన్నంగా, ఐదు నిమిషాల నిడివి గల ఫైట్ సీక్వెన్స్‌ను ఒకే సింగిల్ లాంగ్ షాట్‌లో చిత్రీకరించడం చాలా సవాలుతో కూడుకున్న పని అని చెప్పారు. అయితే తెరపై ఆ సన్నివేశం అత్యంత సహజంగా కనిపిస్తుందని వెల్లడించారు. తిరువనంతపురంలోని ఒక షాపింగ్ మాల్‌లో తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు, అలాగే సగానికి కోసిన బస్సులో చిత్రీకరించిన ఫైట్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని పృథ్వీరాజ్ తెలిపారు.

Advertisement

వివరాలు

ఆ ప్రమాదం మరచిపోలేనిది..

చిత్రీకరణ సమయంలో ఒక ఫైటర్ మెడ వెనుక భాగంలో 37 కుట్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అదే ప్రమాదం తనకు జరిగి ఉంటే కనీసం ఆరు నెలల పాటు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చేదని చెప్పారు. యాక్షన్ సన్నివేశాలంటే తనకు ఇప్పటికీ ఎంతో ఇష్టమేనని, అయితే గత అనుభవం తర్వాత ప్రతి ఫైట్ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నానని వివరించారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు పార్వతి తిరువోతు, హకీమ్ షాజహాన్, అశోకన్, విజయ రాఘవన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Advertisement