LOADING...
Actor Nani: నాని ఎంతమందికి ఐలవ్యూ చెప్పాడో తెలుసా.. ? జగపతి బాబు టాక్ షోలో నేచరల్ స్టార్ సందడి
నాని ఎంతమందికి ఐలవ్యూ చెప్పాడో తెలుసా.. ? జగపతి బాబు టాక్ షోలో నేచరల్ స్టార్ సందడి

Actor Nani: నాని ఎంతమందికి ఐలవ్యూ చెప్పాడో తెలుసా.. ? జగపతి బాబు టాక్ షోలో నేచరల్ స్టార్ సందడి

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 25, 2025
05:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం నాని ఇండస్ట్రీలో విభిన్నమైన కథా అంశాలతో నిర్మితమైన సినిమాలతో వరుస హిట్స్ సాధిస్తున్నారు. ఇప్పటికే హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించిన ఆయన, ఇప్పుడు ప్యారడైజ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కొన్ని రోజులుగా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్ విడుదల అయ్యి సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. త్వరలో ఈమూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలాంటి క్రమంలో,ప్రముఖ నటుడు జగపతి బాబు హోస్ట్ చేసే జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోలో నాని పాల్గొన్నారు. ఈటాక్ షో రెండురోజాల క్రితం ప్రారంభమైంది. మొదటి ఎపిసోడ్‌లో నటుడు నాగార్జున అతిథిగా హాజరయ్యారు. ఆ తర్వాత శ్రీలీల కూడా ఆ షోలో పాల్గొన్నారు.ఇప్పుడు,మూడో ఎపిసోడ్‌లో నాని పాల్గొన్నారని ప్రోమో ద్వారా వెల్లడయింది.

వివరాలు 

నాని చిన్నప్పటి స్నేహితుడి ఎంట్రీ 

తాజాగా విడుదలైన ప్రోమోలో నాని తన పర్సనల్ లైఫ్ గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మనం మొదటిసారి ఎప్పుడు కలిశాం గుర్తుందా నీకు ? అని జగపతి బాబు అడగ్గా.. మీక గుర్తుందా ? అని నాని రివర్స్ అడిగారు. దెబ్బతింది నేను కదా.. నాకు గుర్తుంటుంది అని జగపతి బాబు అనడంతో నాని ఆశ్చర్యపోయారు. అదేవిధంగా,నాని చిన్నప్పటి స్నేహితుడిని తీసుకువచ్చి షోలో సర్‌ప్రైజ్ చేశారు. ప్రోమోలో మరో సన్నివేశం ..నాని ఎంతమందికి ఐ లవ్ యూ చెప్పారు? అని జగపతి బాబు అడిగారు. దీనిపై నాని గట్టిగా నవ్వారు.ఆ విషయం గురించి నాని స్నేహితుడు కూడా ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నించారు. ఎపిసోడ్‌లో ఈ విషయం ఎలా బయటపడతుందో ఆసక్తిగా చూడవచ్చు.

వివరాలు 

మార్చి 26న ప్రేక్షకుల ముందుకు ప్యారడైజ్ సినిమా

ఈ మూడో ఎపిసోడ్ ఈనెల 29న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. నాని చివరగా హిట్ 3 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ప్యారడైజ్ సినిమాను మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జీ తెలుగు చేసిన ట్వీట్