NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / పెళ్ళి చేసుకోబోతున్న నరేష్, పవిత్ర.. ముద్దు పెట్టి మరీ ప్రకటన
    తదుపరి వార్తా కథనం
    పెళ్ళి చేసుకోబోతున్న నరేష్, పవిత్ర.. ముద్దు పెట్టి మరీ ప్రకటన
    నరేష్, పవిత్రల పెళ్ళి ప్రకటన

    పెళ్ళి చేసుకోబోతున్న నరేష్, పవిత్ర.. ముద్దు పెట్టి మరీ ప్రకటన

    వ్రాసిన వారు Sriram Pranateja
    Dec 31, 2022
    02:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సినిమా ఇండస్ట్రీలో పనిచేసే హీరోల గురించి, హీరోయిన్ల గురించి, క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించి అనేక పుకార్లు షికారు చేస్తుంటాయి. కొన్ని కొన్నిసార్లు అవన్నీ పుకార్లుగానే మిగిలిపోతే మరికొన్ని సార్లు అవి నిజాలుగా బయటకు తేలతాయి.

    ఈరోజు అలాంటి న్యూసే టాలీవుడ్ సీనియర్ హీరో నరేష్ నుండి బయటకు వచ్చింది. సీనియర్ హీరో నరేష్, సీనియర్ హీరోయిన్ పవిత్ర సహజీవనం చేస్తున్నారని గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వచ్చాయి.

    వీరిద్దరి మధ్య బంధం గురించి సోషల్ మీడియా కోడై కూసింది. ఐతే తమ బంధం ప్రేమ కాదని కేవలం స్నేహం మాత్రమే అని నరేష్, పవిత్రలు చెప్పుకొచ్చారు.

    ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఒకే హోటల్ లో ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి.

    తెలుగు సినిమా

    నరేష్, పవిత్రల పెళ్ళి

    ప్రస్తుతం నరేశ్, పవిత్రలు తమ బంధాన్ని వివాహ బంధం చేసుకోవడానికి సిద్ధమైపోయారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా నటుడు నరేష్ ప్రకటన చేసారు.

    కొత్త సంవత్సరంలో కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నానని చెబుతూ ఒక వీడియోని పోస్ట్ చేసారు. ఆ వీడియోలో నరేష్, పవిత్రలు ఒకరికొనొకరు ముద్దు పెట్టుకుంటూ కనిపించి, మరికొద్ది రోజుల్లో పెళ్ళి చేసుకోబోతున్నాం అని తెలియజేసారు.

    అంతేకాదు అభిమానుల ఆశీర్వాదం కావాలని కోరుతూ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు నరేష్.

    మొత్తానికి ఎన్నో రోజుల నుండి వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. మరి వీరి పెళ్ళి ఎప్పుడు ఉంటుందో ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ పెళ్ళి గురించే టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    తెలుగు సినిమా

    2022 రివైండ్: బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడ్డ చిత్రాలు టాలీవుడ్
    మహేష్ తో సినిమాపై శ్రీలీల మౌనం... కారణం అదేనా? టాలీవుడ్
    బాలయ్యను కలిసిన పవన్ కళ్యాణ్.. కారణం అదేనంటూ అభిమానుల గోల టాలీవుడ్
    తెలుగు సినిమాల దెబ్బా.. తమిళ సినిమాలు అబ్బా టాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025