Sobhan Babu: నటుడు శోభన్‌బాబు భార్య శాంతకుమారి మృతి
వ్రాసిన వారు
Moogati Shabari
Jul 10, 2026
10:50 am
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినిమా పరిశ్రమలో చిరస్మరణీయ నటుడిగా నిలిచిన శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి (86) గురువారం తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో నాలుగు రోజుల క్రితం చెన్నైలోని ఆమె నివాసానికి సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
వివరాలు
సంతాపం తెలుపుతున్న సినీ ప్రముఖులు..
వైద్య చికిత్స పొందుతున్న సమయంలో గురువారం ఆమెను పరామర్శించేందుకు వచ్చిన స్నేహితురాలితో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) రావడంతో ఆమె కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శాంతకుమారి భౌతికకాయానికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె మరణవార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.