Abhinaya: వివాదాస్పద సీన్‌పై స్పందించిన నటి అభినయ
ఈ వార్తాకథనం ఏంటి
హీరోయిన్ అభినయ 'శంభో శివ శంభో' టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. తాజాగా మలయాళ చిత్రమైన 'పని'లో ఆమె ప్రధాన పాత్ర పోషించారు.
ఈ చిత్రం జోజూ జార్జ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక మలయాళ చిత్రం కాగా, ప్రస్తుతం ఓటిటిలో ఈ చిత్రం మీద అందుబాటులో ఉంది.
అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌పై చిత్రీకరించిన అత్యాచార సన్నివేశం వివాదాస్పదంగా మారింది. దీనిపై పలువురు విమర్శలు చేశారు.
ఈ విషయంపై అభినయ స్పందించింది. చిత్రీకరణలో సన్నివేశాల ఎంపిక పూర్తిగా దర్శకుడి నిర్ణయమేనని చెప్పారు.
తాను పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదని, జోజూ గొప్ప నటుడు అని, ఆయన అనుభవం తనకు ఎంతో సాయపడిందన్నారు.
Details
మలయాళ చిత్రలో నటించడం ఆనందంగా ఉంది
మలయాళ సినిమాల్లో నటించడం తనకు భిన్నమైన అనుభూతిని ఇచ్చిందని అభినయ చెప్పారు. చిత్రీకరణ సమయంలో జోజూ తనకు సలహాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
తాను ఎప్పటి నుంచో జోజూ జార్జ్‌తో పనిచేయాలనుకుంటున్నానని, అయితే ఈ సినిమా ద్వారా ఆ అవకాశం వచ్చిందన్నారు. టొవినో థామస్ నటనంటే తనకు ఎంతో ఇష్టమని, రాజమౌళి చిత్రంలో నటించడం కూడా తన కల అని ఆమె అభిప్రాయపడారు.
కుటుంబ సభ్యుల సహకారం లేకుండా ఈ స్థాయికి చేరుకోలేనని అభినయ తెలియజేశారు.