LOADING...
Actress Ramya: మగాళ్లను వీధి కుక్కలతో పోల్చిన నటి.. సోషల్ మీడియాలో రచ్చ!
మగాళ్లను వీధి కుక్కలతో పోల్చిన నటి.. సోషల్ మీడియాలో రచ్చ!

Actress Ramya: మగాళ్లను వీధి కుక్కలతో పోల్చిన నటి.. సోషల్ మీడియాలో రచ్చ!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 08, 2026
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

నటి రమ్య ఒకప్పుడు కన్నడ చిత్రసీమలో అగ్ర కథానాయికగా మంచి పేరు సంపాదించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె, ఇప్పుడు క్రియాశీల రాజకీయాలకూ దూరంగా ఉంటున్నారు. అయితే సినిమాలపై ఆసక్తి మాత్రం తగ్గలేదు. మళ్లీ వెండితెరపై కనిపించాలనే లక్ష్యంతో ఓ సినిమా నిర్మాణ సంస్థను కూడా ఆమె ప్రారంభించారు. రాజకీయాలకు కొంత విరామం ఇచ్చినా, సామాజిక అంశాలపై స్పందిస్తూ మాత్రం రమ్య ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటున్నారు.

వివరాలు 

వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ

జంతువుల పట్ల ప్రేమ ఉన్న వ్యక్తిగా రమ్యకు ప్రత్యేక గుర్తింపు ఉంది.ముఖ్యంగా మూగజీవుల హక్కులు,వీధి కుక్కల సమస్యలపై ఆమె తరచూ తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తుంటారు. అవసరం వచ్చిన ప్రతిసారి జంతువుల తరఫున గళమెత్తడం ఆమెకు అలవాటే. గత ఏడాది జూలైలో వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కలను ఆశ్రయ కేంద్రాల్లో ఉంచాలని కోర్టు సూచించగా, ఈ నిర్ణయంపై రమ్యతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కుక్కల ప్రేమికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆనిర్ణయానికి వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో నిరసనలు కూడా జరిగాయి.ఇటీవల ఇదే అంశంపై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు,వీధి కుక్కలను వాటి ప్రవర్తన ఆధారంగా వేరు చేయడం సాధ్యం కాదని వ్యాఖ్యానించింది.

వివరాలు 

సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై రమ్య అసహనం

"ఈ కుక్క కాటేస్తుంది, ఈ కుక్క కాటేయదు అని ముందే నిర్ణయించడం అసాధ్యం.వీధి కుక్కల మూడ్‌ను ఎవ్వరూ సులభంగా అర్థం చేసుకోలేరు"అని పేర్కొంటూ,అందుకే అన్ని కుక్కలను ఆశ్రయ కేంద్రాల్లో ఉంచడమే సరైన మార్గమని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలపై రమ్య అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆమె,ఒక ఘాటైన ఉపమానం ఉపయోగించారు. "మగాళ్లను కూడా అర్థం చేసుకోవడం చాలా కష్టం.వారు ఎప్పుడు అత్యాచారం చేస్తారో,ఎప్పుడు హత్య చేస్తారో తెలియదు. అలా అయితే పురుషులందరినీ జైలులో పెట్టాలా?" అంటూ ప్రశ్నించారు.

Advertisement

వివరాలు 

వీధి కుక్కలను పురుషులతో పోల్చడం ఎంతవరకు సమంజసం

ఈ వ్యాఖ్య ద్వారా కాటేసే కుక్కలు,సౌమ్యంగా ఉండే కుక్కలను వేరు చేయడం కష్టం అన్న కారణంతో అన్ని వీధి కుక్కలను ఆశ్రయ కేంద్రాల్లో ఉంచడం సరికాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. పురుషులను కుక్కలతో పోలుస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రమ్య వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. వీధి కుక్కల సమస్యను పురుషులతో పోల్చడం ఎంతవరకు సమంజసం అన్న అంశంపై విస్తృతంగా వాదనలు సాగుతున్నాయి.

Advertisement