LOADING...
Ramya Sri: గచ్చిబౌలిలో నటి రమ్యశ్రీ, సోదరుడిపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు
గచ్చిబౌలిలో నటి రమ్యశ్రీ, సోదరుడిపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు

Ramya Sri: గచ్చిబౌలిలో నటి రమ్యశ్రీ, సోదరుడిపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 18, 2025
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

గచ్చిబౌలి ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఫెర్టిలైజర్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎంప్లాయిస్‌ కో-ఆపరేటివ్‌ హౌజింగ్‌ సొసైటీ (ఎఫ్‌సీఐ) లేఅవుట్‌లో నిర్మాణ ఆక్రమణలపై హైడ్రా నెల క్రితమే కీలక చర్యలు చేపట్టింది. అనుమతులు లేకుండానే నిర్మించిన సంధ్యా కన్వెన్షన్‌ మినీహాల్‌, గదులు, రెండు షెడ్లను హైడ్రా అధికారులు తొలగించారు. ఈ కన్వెన్షన్‌ యజమాని శ్రీధర్‌రావు లేఅవుట్‌లోని రహదారులు, పార్కుల ఆనవాళ్లను మాయం చేశారని ఆరోపించిన ప్లాట్‌ యజమానులు, వాటిని తిరిగి పునరుద్ధరించాలంటూ హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు వినతిపత్రం అందజేశారు. దీంతో మంగళవారం హైడ్రా, శేరిలింగంపల్లి టౌన్‌ప్లానింగ్‌ అధికారులు లేఅవుట్‌ రహదారుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీనటి రమ్యశ్రీ, తన సోదరుడు ప్రశాంత్‌ సహా పలువురు ప్లాట్‌ యజమానులు హాజరయ్యారు.

Details

వెంకటేశ్ పై చర్యలు తీసుకోవాలి

అయితే మధ్యాహ్న భోజనానికి వెళ్లే క్రమంలో రమ్యశ్రీ, ప్రశాంత్‌లను శ్రీధర్‌రావు అనుచరులు అడ్డగించారు. వారు తీసిన వీడియోలపై ప్రశ్నిస్తూ ఫోన్‌ లాక్కొనే ప్రయత్నం చేశారు. ప్రశాంత్‌ అడ్డుకోవడంతో ఆయనపై దాడికి దిగారు. ఈ ఘటనపై శ్రీధర్‌రావు అనుచరుడు వెంకటేశ్‌పై చర్యలు తీసుకోవాలని రమ్యశ్రీ, ప్రశాంత్‌లు గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి, అధికారుల సమక్షంలో రహదారుల గుర్తింపు పనులను కొనసాగించారు. ఈ గొడవ జరిగిన సమయంలో అధికారులు అక్కడ లేరని, తమ సమక్షంలో ఘటన జరగలేదని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ స్పష్టం చేశారు.