Trisha: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు.. మండిపడ్డ నటి త్రిష
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటి త్రిష కృష్ణన్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ యువ హీరోయిన్స్‌తో సమానంగా పోటీ పడి, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఆమె గురించి ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చెందుతున్న తప్పుడు వార్తలు ఆమెను తీవ్ర అసహనానికి గురి చేశాయి. ముఖ్యంగా త్రిష పెళ్లి, రాజకీయ ప్రవేశం వంటి అంశాలపై నిరంతరం ప్రచారం జరుగుతుండడంతో, నటి స్వయంగా స్పందించి ఆ వార్తలన్నింటినీ ఖండించింది. నేను ఎవరితో ఫోటో దిగితే వారినే పెళ్లి చేసుకున్నట్టేనా? ఇంకా ఎంతమందితో నా పెళ్లి చేస్తారు?" అంటూ త్రిష నేరుగా ప్రశ్నించింది.
Details
ఫేక్ న్యూస్ ను ఆపాలి
స్నేహితులతో దిగిన ఫోటోలను వక్రీకరించి అసత్య కథనాలు సృష్టించడం అసహ్యానికి గురిచేస్తోందని ఆమె హెచ్చరించింది. ఫేక్ న్యూస్‌ను ఆపాలని సోషల్ మీడియా ద్వారా ఇండైరెక్ట్‌గా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఆమె ఈ హెచ్చరికతోనైనా ఈ రకమైన రూమర్లు తగ్గుతాయా అన్నది చూడాల్సి ఉంది. త్రిష ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్-ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'లో నటిస్తోంది. వశిష్ట్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో, అత్యాధునిక గ్రాఫిక్స్‌తో, భారీ బడ్జెట్‌పై రూపొందుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
Details
వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్
ఇప్పటికే విడుదలైన టీజర్, పాట సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి. సుమారు రూ. 150 కోట్ల వ్యయంతో పూర్తయిన ఈ మూవీ మొదట 2025 సంక్రాంతికి విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం సినిమా 2026 సమ్మర్‌లో థియేటర్లకు వచ్చే అవకాశముంది. చాలా కాలం తర్వాత తెలుగులో నేరుగా నటిస్తున్న త్రిషకు 'విశ్వంభర' ఏ విధమైన ఫలితాన్ని ఇస్తుందో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.